[ad_1]
చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జులై 14న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేడు చంద్రుడ్ని ముద్దాడనుంది. ఇందుకు ఇస్రో ఏర్పాట్లును పూర్తిచేసింది. ప్రస్తుతం ల్యాండర్ జాబిల్లికి 30 కి.మీ. దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్‌ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని, విక్రమ్ ల్యాండర్ నిర్దేశిత ప్రాంతానికి సాయంత్రం.5.44 గంటలకు చేరుకుంటుందని ఇస్రో తాజాగా వెల్లడించింది.
⍟ అదే సమయానికి ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. సాయంత్రం గం.5.20 సమయానికి ప్రత్యక్ష ప్రసారం మొదలవుతుందని ఇస్రో వివరించింది.
⍟ అదే సమయానికి ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. సాయంత్రం గం.5.20 సమయానికి ప్రత్యక్ష ప్రసారం మొదలవుతుందని ఇస్రో వివరించింది.
⍟ ల్యాండింగ్ ప్రక్రియలో చివరి పదిహేడు నిమిషాలు చాలా కీలకం కానున్నాయి. ఈ సమయంలోనే ల్యాండర్ వేగాన్ని నియంత్రించి క్రమంగా.. ఉపరితలంపై ల్యాండ్ చేయనున్నారు.
⍟ చంద్రుడిపై అధ్యయనం కోసం ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో తమిళనాడులోని నమక్కల్ మట్టి కీలక పాత్ర పోషించింది. చంద్రయాన్-3 కోసం కూడా ఇక్కడి నుంచి మట్టిని సేకరించారు. తమిళనాడులోని నమక్కల్ మట్టిని 2012లో తొలిసారి 50 టన్నులను ఇస్రో సేకరించింది. దానికి పలు పరీక్షలు నిర్వహించగా.. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి లాంటి లక్షణాలు ఉన్నట్లు ఇస్రో ధ్రువీకరించింది. దీంతో చంద్రయాన్ సన్నాహక ప్రయోగాలను ఈ మట్టిపై నిర్వహించారు.
[ad_2]
Source link
Leave a Reply