Chandrayaan 3 Soil: చంద్రయాన్‌ 3 ప్రయోగానికి భూమిపై పరీక్షలు.. తమిళనాడు నుంచి ప్రత్యేక మట్టి

[ad_1]

Chandrayaan 3 Soil: అంతరిక్షంలో ప్రయోగం అంటే పూర్తిగా మన కంట్రోల్‌లో ఉండదు. అందుకే భూమిపైనే ఉపగ్రహాలు, నింగిలోకి పంపే ప్రతీ పరికరానికి శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరీక్షలు నిర్వహించి పంపిస్తారు. ఈ క్రమంలోనే అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపైనే ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా పరిశోధనలు చేస్తారు. అక్కడి పరిస్థితులకు అన్ని రకాల సిద్ధమయ్యేందుకు భూమిపైనే పలు పరీక్షలు నిర్వహిస్తారు. ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగంలోనూ ఇలాంటి పరీక్షలే దాన్ని చంద్రుడిపైకి పంపే ముందు చేశారు. అయితే చంద్రయాన్ 3 ప్రయోగంలోని ప్రగ్యాన్ రోవర్.. చంద్రుడి ఉపరితలంపై దిగి పలు పరిశోధనలు జరపనుంది. దానికోసం చంద్రుడి ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ తిరగనుంది. ఈ క్రమంలోనే చంద్రుడిపై ఉండే పరిస్థితులను భూమిపై కల్పించి.. రోవర్‌ ప్రయాణాన్ని పరీక్షించారు. అందుకోసం ప్రత్యేకంగా సేకరించిన మట్టిని కూడా తీసుకువచ్చారు.

చంద్రుడి మీద అడుగుపెట్టనున్న చంద్రయాన్‌ 3 ల్యాండర్‌, రోవర్‌ మాడ్యూల్‌లకు భూమిపైనే ఇస్రో పలుమార్లు పరీక్షలు నిర్వహించింది. అయితే చంద్రుడి మీద తిరిగే ప్రగ్యాన్ రోవర్ కోసం భూమిపైనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేకంగా మట్టిని కూడా తీసుకువచ్చారు. చెన్నైకి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నమక్కల్ అనే ఊరి పేరు ప్రపంచానికి అంతగా పరిచయం ఏమీ లేదు. అయితే ఇస్రోకు మాత్రం ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో నమక్కల్‌ ఊరి మట్టి ఎంతో కృషి చేసింది. చంద్రయాన్‌ 3 ప్రయోగం కోసం కూడా నమక్కల్ నుంచి మట్టిని సేకరించారు.

2008 లో చంద్రయాన్‌ 1 విజయవంతమైన తర్వాత మరో ప్రయోగం కోసం ఇస్రో సిద్ధమైంది. అయితే చంద్రయాన్‌ 1 కేవలం చంద్రుడి కక్ష్యలో మాత్రమే తిరిగింది. ఆ తర్వాత చంద్రుడిపై దిగేందుకు చంద్రయాన్‌ 2 ను ప్రయోగించారు. ఇందులో విక్రమ్ ల్యాండర్‌ మాడ్యూల్‌ జాబిల్లిపై దిగితే.. అందులోని రోవర్‌ బయటికి వచ్చి తిరిగేలా సిద్ధం చేశారు. అయితే అక్కడ ఉండే పరిస్థితులకు అలవాటు పడి.. పరిశోధనలు చేసేందుకు భూమిపైనా రోవర్‌కు అక్కడ ఉండే మట్టిని ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని నమక్కల్‌ మట్టిని గుర్తించారు. 2012 లో తొలిసారి నమక్కల్ నుంచి 50 టన్నుల మట్టిని ఇస్రో సేకరించింది. అది చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి లక్షణాలనే పోలి ఉన్నట్లు ఇస్రో ధ్రువీకరించిందని పెరియార్‌ యూనివర్సిటీలోని జియాలజీ విభాగ ప్రొఫెసర్‌ ఎస్‌. అన్బళగన్‌ వెల్లడించారు.

ఈ క్రమంలోనే 2019 లో ప్రయోగించిన చంద్రయాన్‌ 2 ప్రయోగంలో నమక్కల్‌ మట్టిని తీసుకువచ్చి.. ల్యాండర్‌, రోవర్‌ లను అక్కడ తిరిగేలా చేశారు. ప్రస్తుతం ప్రయోగించిన చంద్రయాన్‌ 3 లోనూ నమక్కల్ మట్టినే ఉపయోగించారు. తాము చేపట్టిన పరిశోధనల్లో భాగంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మట్టి.. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి లాగే ఉందని అన్బళగన్ వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ ధ్రువంపై ఉన్న మట్టి మాదిరిగానే ఇది ఉంటుందని చెప్పారు. జాబిల్లి ఉపరితలంపై అనోర్థోసైట్‌ రకం మట్టి ఉందని.. నమక్కల్‌ చుట్టుపక్కల గ్రామాలైన సీతంపూంది, కున్నమళై ప్రాంతాల్లో ఈ రకం మట్టి చాలా దొరుకుతుందని తెలిపారు. ఇస్రో చేపట్టే భవిష్యత్ ప్రయోగాలకు కూడా తాము ఇక్కడి నుంచి మట్టి పంపిస్తామని అన్బగళన్ చెప్పారు.

PM Modi: చంద్రయాన్ 3 ల్యాండింగ్.. సౌతాఫ్రికా నుంచి వర్చువల్‌గా వీక్షించనున్న మోదీ

Vajpayee: వాజ్‌పేయి సూచనతోనే చంద్రయాన్‌కు ఆ పేరు.. అంతకుముందు ఏం పేరంటే?
Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *