China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన

[ad_1]

చంద్రుడిపై పరిశోధనలకు 2030లో వ్యోమగాములను పంపనున్నట్లు చైనా తాజాగా ప్రకటించింది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అంతరిక్ష ప్రణాళికను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా చంద్రుడిపై అధ్యయనానికి వ్యోమగాములను పంపుతున్నట్టు చైనా మానవసహిత అంతరిక్ష సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. దీంతో పాటు మంగళవారం తన సొంత అంతరిక్ష కేంద్రానికి మూడో విడతగా ముగ్గురు వ్యోమగాములను పంపింది. వారిలో ఇద్దరు వ్యోమగాములు జింగ్‌ హైపెంగ్‌, జూయాంగ్జూ.. పౌర వ్యోమగామి గుయ్‌ హైచావో ఐదు నెలల వరకూ అక్కడే ఉంటారు. ఇన్నర్‌ మంగోలియాలోని జ్యూకాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి షెంజావో-16 వ్యోమనౌక లాంగ్‌మార్చ్ 2ఎఫ్ రాకెట్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9.31 గంటలకు బయలుదేరింది.

ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములందరూ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందినవారే. మిషన్ కమాండర్ జింగ్ హైపెంగ్‌ నాలుగోసారి అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఇంజనీర్ జూయాంగ్జూతో పాటు మొదటిసారిగా పౌర వ్యోమగామి గుయ్‌‌ను పంపుతోంది. బీహాంగ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అయిన హైచావో ఈ ఘనత సాధించారు.

ఈ నేపథ్యంలో చైనా మానవసహిత అంతరిక్ష సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ జికియాంగ్‌ మాట్లాడుతూ… ‘‘చైనా ఇటీవల మానవసహిత చంద్రమండల అన్వేషణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2030 కల్లా చంద్రుడిపైకి మనిషిని పంపి, అక్కడ పరిశోధనలు, వాటికి సంబంధించిన ప్రయోగాలు చేయడమే మా లక్ష్యం’’ అని చెప్పారు.

తియాంగాంగ్ అనేది చైనా అంతరిక్ష మిషన్‌లో కీలక ప్రాజెక్ట్. అంగారక గ్రహం, చంద్రునిపై రోబోటిక్ రోవర్ల, ల్యాండింగ్‌ వంటి ప్రయోగాలతో పాటు కక్ష్యలోకి మానవులను పంపిన మూడో దేశంగా నిలవడంలో దీని పాత్ర ఉంది. ‘అప్లికేషన్ అండ్ డెవలప్‌మెంట్’ దశలోకి ప్రవేశించిన తర్వాత తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు ఈ మిషన్ మొదటిది అని బీజింగ్ తెలిపింది.

కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత షెన్‌జౌ-16 అంతరిక్ష కేంద్రం తియాన్హే కోర్ మాడ్యూల్‌లో ప్రవేశించడానికి షెన్‌జౌ-15 ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి ఆరు నెలల పాటు అక్కడ ఉండి తిరిగొచ్చిన ముగ్గురు సహోద్యోగులను కలుసుకున్నారు. షెన్‌జౌ-16 మిషన్ కక్ష్యలో ప్రయోగాలు, సరికొత్త క్వాంటమ్ దృగ్విషయం, అధిక-ఖచ్చితమైన స్పేస్ టైమ్-ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్, సాధారణ సాపేక్షత ధ్రువీకరణ, జీవితం మూలాలను అధ్యయనం చేయనుంది.

షెన్‌జౌ-16 కోసం ఈ నెలలో అంతరిక్ష కేంద్రానికి తాగునీరు, దుస్తులు, ఆహారం, ప్రొపెల్లెంట్‌లను తిరిగి సరఫరా చేశారు. ‘మానవ అంతరిక్ష కార్యకలాపాలలో లోతైన అనుభవాన్ని గడించడం చాలా ముఖ్యం.. అన్ని సమయాలలో కొత్త అద్భుతమైన మైలురాళ్లను అందుకోవడం సాధ్యం కాదు’అని హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ అన్నారు. షెన్‌జౌ-17ను వచ్చే ఏడాది అక్టోబరులో చైనా పంపనుంది.


Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *