PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Coffee : చలికాలంలో ఎంజాయ్ చేసే స్పెషల్ కాఫీ.. ఎలా చేయాలంటే..

[ad_1]

Produced by Ravula Amala | Samayam Telugu | Updated: 16 Dec 2022, 11:15 am

Coffee : కాఫీని చాలా మంది ఇష్టపడతారు. ఉదయాన్నే లేవగానే కాఫీ అనేది మనల్ని రీఫ్రెష్ చేస్తుంది. అయితే, ఎప్పుడూ ఒకే కాఫీ తాగితే బోర్ కొడుతుంది. అదే దీనిని టేస్టీగా అనేక రకాలుగా చేసుకోవచ్చు. కాఫీ షాప్‌లో ఎన్నో వెరైటీ కాఫీలు ఉంటాయి. అవి అక్కడే కాకుండా మనం ఇంట్లోనూ తయారవ్వొచ్చు. ఈ ఆర్టికల్‌లో మనం టేస్టీ కాఫీ రెసిపీస్‌ని ఎలా తయారు చేయాలో షిఫా ఖాన్ ద్వారా తెలుసుకుందాం.

 

కాఫీ

ప్రధానాంశాలు:

  • చలికాలంలో కాఫీని ఎంజాయ్ చేసే ప్రజలు
  • టేస్టీ కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలంటే..
స్వీట్ కారెమెల్ కాఫీ..

  • ప్రిపరేషన్ టైమ్ 5 నిమిషాలు
  • తయారీ టైమ్ 3 నిమిషాలు

కావాల్సినవి

  • ఎస్ప్రెసో షాట్ 40 మిల్లీ లీటర్లు
  • ఇంట్లో తయారు చేసిన కారామెల్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు
  • లో ఫ్యాట్ పాలు 120 మి.లీ..

Also Read : Egg Yolk : గుడ్డు పచ్చసొన తినకూడదా..
తయారీ విధానం..

  • ముందుగా 2 టేబుల్స్పూన్ల కారమెల్ సిరప్ కప్‌లో వేసుకోవాలి
  • తర్వాత ఓ షాట్ ఎస్ప్రెసో
  • ఇప్పుడు లో ఫ్యాట్ మిల్క్ వేసి కలపాలి. ఫోమ్ కోసం రెండు గ్లాసులు తీసుకుని అటు ఇటాగా పాలు పోయండి
  • చివరగా కారమెల్ డ్రిజిల్‌తో గార్నిష్ చేయండి.


చాకో మాచో లాటె..

  • ప్రిపరేషన్ టైమ్ – 5 నిమిషాలు
  • తయారీ సమయం -3 నిమిషాలు
  • సర్వింగ్స్ ఒకరికి

కావాల్సిన పదార్థాలు..

  • ఎస్ప్రెసో షాట్ – 30-40 మి.లీ.
  • డార్క్ చాక్కెట్ స్క్వేర్స్ 2, 3
  • లో ఫ్యాట్ హాట్ మిల్క్ 120 మి.లీ
  • కొకో పౌడర్ గార్నిష్ కోసం

Also Read : Jaggery : బెల్లం తింటే ఊపిరితిత్తులకి మంచిదా..

తయారీ విధానం..

  • ఓ కప్పులో 2, 3 డాక్క్ చాక్లెట్ వేయండి. ఇప్పుడు అందులో ఎస్ప్రెస్సో షాట్ వేయండి
  • లో ఫ్యాట్ మిల్క్ వేసి బాగా కలపాలి.
  • పైన ఫోమ్ వచ్చేలా బాగా కలపండి కోకో పౌడర్ వేయండి.
కాఫీ బెనిఫిట్స్

స్పైస్డ్ టర్మరిక్ లాటె..

  • ప్రిపరేషన్ టైమ్ 5 నిమిషాలు
  • తయారీకి సమయం 5 నిమిషాలు
  • సెర్వింగ్స్ 1

కావాల్సిన పదార్థాలు..

  • ఎస్ప్రెస్సో షాట్ 30 నుంచి 40 మి.లీ
  • లో ఫ్యాట్ హాట్ మిల్క్ 120 మి.లీ
  • తేనె 1 టేబుల్ స్పూన్
  • దాల్చిన చెక్క పొడి కొద్దిగా
  • క్రష్డ్ పిస్తా గార్నిష్ కోసం

Also Read : Chia seeds : ఈ చియా రెసిపీస్‌తో కిలోల కొద్దీ బరువు తగ్గుతారట..

తయారీ విధానం..

  • ఓ కప్పులో పసుపు, దాల్చిన చెక్క పొడి వేయాలి
  • ఇప్పుడు పాలు వేసి బాగా కలపాలి
  • ఇప్పుడు అందులో తేనె వేయాలి.
  • ఇప్పుడు అందులో ఎస్ప్రెస్సో వేసి నురుగ వచ్చి బాగా కలపండి. చివరగా క్రష్డ్ పిస్తా, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపండి

ఇలా ఏం కావాలో వాటిని ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. వీటిని చల్లని గాలుల్లో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వీటన్నింటిలో రోజుకో వెరైటీని ట్రై చేయొచ్చు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *