EctoLife అమేజింగ్.. ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనే ‘గర్భం’ ఇది!

[ad_1]

EctoLife ప్రపంచంలోనే మొట్టమొదటి ‘కృత్రిమ గర్భ సౌకర్యం’ పరిశోధకులు సృష్టించారు. యాక్టో‌లైఫ్ అని పిలిచే దీని ద్వారా ఏడాదికి 30 వేల మంది శిశువులకు జన్మనివ్వొచ్చని పేర్కొన్నారు. సౌలభ్యం కోసం ‘ఉత్పత్తి’ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించామని పేర్కొంటూ దీనికి సంబంధించిన యానిమేషన్ వీడియోను యెమెన్ మాలిక్యులర్ బయోటెక్నాలజిస్ట్ హషీమ్ అల్-ఘైలీ విడుదల చేశారు. అచ్చం సైన్స్ ఫిక్షన్ సినిమా మాదిరిగా ఉన్న ఈ వీడియోను ఇంటర్నెట్‌లో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సూపర్ ఇన్నోవేటర్స్ నివేదిక ప్రకారం.. ఈ సౌకర్యం ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. కానీ దీని ఉద్దేశం జనాభా క్షీణతతో బాధపడుతున్న దక్షిణ కొరియా, బల్గేరియా, జపాన్, మొదలైన దేశాలకు సహాయం చేయడమేనని హషీమ్ పేర్కొన్నారు. 8 నిమిషాలకుపైగా ఉన్న యానిమేషన్ వీడియోలో ఈ సౌకర్యం పూర్తిగా పునరుత్పాదక శక్తితో పనిచేస్తుందని తెలిపారు. యాక్టోలైఫ్ సౌకర్యం కోసం ప్రయోగశాలలో పెద్ద సంఖ్యలో కృత్రిమ గర్భాలు ఉంటాయని, దానిలోపల శిశువులు పెరుగుతాయని అన్నారు.

యాక్టోలైఫ్ సంతానం లేని దంపతులు బిడ్డను కనడానికి, నిజమైన తల్లిదండ్రులుగా మారడానికి వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, కేన్సర్ లేదా ఇతర సమస్యల కారణంగా శస్త్రచికిత్స ద్వారా గర్భాశయం తొలగించిన మహిళలకు ఇది పరిష్కారంలా ఉంటుందన్నారు. ఈ సౌకర్యంలో 75 లేబొరేటరీలు ఉన్నాయని, ఒక్కో దానిలో 400 గ్రోత్ ప్యాడ్స్ లేదా కృత్రిమ గర్భస్థ పిండాలను పెంచగల సామర్థ్యం ఉందని తెలిపారు.

తల్లి గర్భాశయంలోని పరిస్థితులను అనుకరించేలా, పుట్టబోయే బిడ్డకు అనుగుణంగా ఉండేలా ప్యాడ్‌లను రూపొందించినట్లు వివరించారు. దీంతో పాటు గ్రోత్ పాడ్స్‌లో శిశువు హృదయ స్పందన, రక్తపోటు, శ్వాసరేటు, ఆక్సిజన్ స్థాయిలు వంటి ముఖ్యమైన సంకేతాలను పర్యవేక్షించే సెన్సార్లు కూడా ఉంటాయి. ఏదైనా జన్యుపరమైన అసాధారణతలను కూడా పర్యవేక్షించగలదని తెలిపారు.

ఈ గ్రోత్ పాడ్‌ల నుంచి వీర్యం, అండాలను సృష్టించి, ఆపై జన్యుపరంగా ఉన్నతమైన పిండాలను ఎంపిక చేయడానికి కృత్రిమ గర్భధారణ సాంకేతికతను వినియోగిస్తారు. పిల్లల జుట్టు రంగు, కంటి రంగు, ఎత్తు, తెలివితేటలు, చర్మపు రంగు వంటి లక్షణాలు, జన్యుపరమైన వ్యాధులను సవరించవచ్చని చెప్పారు. ఈ సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉందన్న హషీమ్.. కానీ నైతిక పరిమితులు వాస్తవంగా మారడానికి ఆటంకంగా ఉన్నాయన్నారు. ప్రతి ఫీచర్ పూర్తిగా సైన్స్ ఆధారితమైందని, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఇప్పటికే సాధించారని తన వీడియోను ముగించారు.

Read Latest Science and Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *