PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Eggs: కొండెక్కిన కోడిగుడ్డు ధర.. డజన్‍కు రూ.80

[ad_1]

రూ.65 నుంచి రూ. 70

రూ.65 నుంచి రూ. 70

దీంతో పది రోజుల్లో డజను కోడిగుడ్ల ధర ఏకంగా రూ.80కి చేరుకుంది. దీంతో, బయట దుకాణాల్లో లూజ్‌ ధర మళ్లీ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏడాది నుంచి డజను గుడ్ల ధర రూ.65 నుంచి రూ. 70 మధ్య ఉంది. అయితే.. ఇప్పుడు ఏకంగా ఎనభైకి చేరడం గమనార్హం.

రోజుకో గుడ్డు

రోజుకో గుడ్డు

కోడి గుడ్ల ధర పెరగడంతో రోజుకో గుడ్డు తినే అలవాటు ఉన్నవారు వారంలో రెండు రోజులకోసారి తింటూ సరిపెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు భోజనంలో ఇవ్వాల్సిన గుడ్డు కూడా మాయమవుతోంది. రెండు రోజులకోసారి ఇవ్వాల్సి ఉండగా మూడు రోజులకోసారి మాత్రమే పెడుతున్నారు. కొన్ని హాస్టళ్లలో గుడ్డుకు బదులు అరటి పండు ఇస్తున్నారు.

రూ.4

రూ.4

రెండు నెలల క్రితం అక్టోబరులో గుడ్డు ధర రూ.4 వరకు ఉండగా, ఇప్పుడు ఏకంగా హోల్ సేల్ మార్కెట్లోనే రూ.6కు చేరుకుంది. నగరాల్లోని రిటెయిల్​షాపుల్లో ఒక్కో గుడ్డు రూ.7కు అమ్ముతున్నారు. పెరిగిన కోళ్ల దాణా ఖర్చు, కూలీ ఖర్చుల కారణంగా ఈ రేటు మరింత పెరిగే అవకాశముందట.

25 కోట్ల కోడిగుడ్లు

25 కోట్ల కోడిగుడ్లు

దేశంలో రోజూ 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో ఏపీలోనే రోజుకు 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో కోడిగుడ్లు అధికంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఇంకా వినియోగం పెరగలేదు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *