విమాన ప్రయాణం..

రానున్న రోజుల్లో విమాన ప్రయాణం గురించి ప్లాన్ చేస్తున్నట్లయితే.. అది మీకు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తోంది. కేవలం రూ.1,199కే ఎవరైనా విమానంలో ప్రయాణించవచ్చు. అంటే నామమాత్రపు రుసుము చెల్లించి దేశంలోనే కాక విదేశాలకు సైతం ప్రయాణం చేయవచ్చు. దీనికోసం గో ఫస్ట్ ట్రావెల్ ఇండియా, ట్రావెల్ సేల్‌ను ప్రారంభించింది. టిక్కెట్ల సేల్ ఈరోజు నుంచి అంటే జనవరి 16 నుంచి ప్రారంభమైంది. GoFirst కంటే ముందు.. Vistara, Indigo వంటి విమానయాన సంస్థలు కూడా ఇటువంటి ఆఫర్లను ప్రారంభించాయి.

టిక్కెట్ల సేల్..

టిక్కెట్ల సేల్..

గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ తన ట్రావెల్ ఇండియా ట్రావెల్ సేల్‌ను ఈరోజు నుంచి జనవరి 19 వరకు అందుబాటులో ఉంచుతోంది. ఈ సేల్ ప్రారంభ ఆఫర్ ధర రూ.1,199గా నిర్ణయించబడింది. ఈ సేల్‌తో దేశ, విదేశాల్లో ప్రయాణించేందుకు తక్కువ ధరలకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. దేశీయ విమానాల్లో ఈ ఆఫర్ రూ.1,199 నుంచి ప్రారంభం కాగా.. అంతర్జాతీయ విమానాల్లో రూ.6,599 నుంచి ప్రారంభమౌతోంది.

చౌక ప్రయాణం వివరాలు..

చౌక ప్రయాణం వివరాలు..

ఎవరైనా ప్రయాణికులు ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవటం ద్వారా ఫిబ్రవరి 4, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2023 వరకు ప్రయాణించేందుకు కంపెనీ వెసులుబాటు కల్పిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్లో ప్రయాణాలు ప్లాన్ చేసుకునేవారికి ఇది ఒక సదవకాశమని చెప్పుకోవచ్చు. ప్రజలు సరసమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించడమే తమ లక్ష్యమని GoFirst CEO కౌశిక్ ఖోనా తెలిపారు. దీనిలో భాగంగానే తక్కువ ధరకు విమాన టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆఫర్‌తో ప్రజలు తమ ప్లాన్‌ని రీషెడ్యూల్ చేసుకునే అవకాశాన్ని కూడా పొందుతారని చెప్పారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *