[ad_1]
మల్బరీ ఆకులు..
మల్బరీ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనకు తెలుసు. ఇవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. మల్బరీ పండ్లలోని పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, , సోడియం, జింక్ , విటమిన్ సి, ఇ, కె, B1, B2, B3, B6, ఫోలెట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మల్బరీ పండ్లే కాదు.. మల్బరీ ఆకులనూ ఒకినావా ద్వీప ప్రజలు తింటారు. ఈ ఆకులలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకులు గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. మల్బరీ ఆకులలోని పోషకాలు శరీరంలోని మంటతో పోరాడతాయి, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. (image source – pixabay)
Diabetes Care: షుగర్ పేషెంట్స్ ఈ 5 నియమాలు పాటిస్తే.. మీ గుండె సేఫ్..!
పర్పల్ చిలగడదుంపలు..
1950లలో, జపాన్ దాదాపు 50% బియ్యంపై ఆధారపడినప్పుడు, ఒకినావా ప్రజలు తమ రోజువారీ కేలరీలలో 67% సన్నని పర్పల్ చిలగడదుంప నుంచి పొందేవారని నివేదిక పేర్కొంది. చిలగడదుంపల్లో ఆరోగ్యకరమైన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపల్లో బ్లూబెర్రీస్ కంటే.. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
(image source – pixabay)
స్క్విడ్ ఇంక్ సూప్..
ఈ టెస్టీ సూప్‌లో ఎంజైమ్‌లు, అమైనో యాసిడ్స్, హార్మోన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్లో ఉంచుతాయి. శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఇది గొప్ప మార్గం.
(image source – pixabay)
గోయా (కాకరకాయలా ఉండే కూరగాయ..)
ఇక్కడి ప్రజలు కాకర కాయలా ఉండే గోయాను ఎక్కువగా తింటూ ఉంటారు. దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. గోయా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది. ఇక్కడ ప్రజలకు.. డయాబెటిస్ రేటు చాలా తక్కువగా ఉండానికి ఇదీ ఒక కారణం.
(image source – pixabay)
సీవీడ్..
సీవీడ్‌లో అయోడిన్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒకినావాన్ ప్రజలు వేడి రోజులలో చల్లబరచడానికి ఈ ప్రత్యేకమైన నాచును తింటుంటారు. ఆసా సముద్రపు పాచిని కూడా తీసుకుంటారు, ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
ముగ్వోర్ట్..
ముగ్వోర్ట్ ఆకులు చేదుగా ఉంటాయి. ఒకినావా ప్రజలు ఈ పచ్చి ఆకులను పంది మాంసంతో కలిపి తింటుంటారు. ఆ ఆకులు జీర్ణక్రియకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. (image source – pixabay)
Health Care: గాయాలు, సర్జరీ కుట్లు త్వరగా మానాలంటే.. ఈ ఫుడ్స్ తినండి..!
[ad_2]
Source link
Leave a Reply