PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

G20 నాయకుల్లో ఎక్కువ ఎంజాయ్‌ చేస్తోంది మోదీనే!

[ad_1]

G20 Summit 2023: 

జీ20 సమావేశాల వేళ భారత ప్రతిష్ఠ మరింత ఇనుమడించనుంది. పెట్టుబడులు పెట్టేందుకు మనల్ని మించిన దేశం మరొకటి లేదని చాటే తరుణం వచ్చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మరొకటి లేదని.. మనకు పోటీ ఎవరూ లేరని గర్వపడే క్షణాలు వచ్చేశాయి. చైనాకు తాము మాత్రమే చెక్‌ పెట్టగలమని ప్రధాని నరేంద్రమోదీ తమ చేతలతో చూపించారు. భారత స్టాక్‌ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠాల్లో కొనసాగుతుండటం, మార్కెట్‌ విలువ 3.8 లక్షల డాలర్లకు చేరుకోవడాన్ని ఆయన ఆస్వాదిస్తున్నారు.

భారత అభివృద్ధి చూపింపేందుకు స్టాక్‌ మార్కెట్‌ ఒక కొలమానం. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లన్నీ ఇబ్బందులు పడుతుంటే మన స్టాక్‌ మార్కెట్లు మాత్రం పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడుల వర్షం  కురిపిస్తున్నారు. రిటైల్‌ బూమ్‌ ఆకాశాన్ని తాకుతోంది. చిన్న చిన్న ఇన్వెస్టర్లూ నిస్సంకోచంగా షేర్లను కొంటున్నారు. భారీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, ఇతర సంస్థలు దివాలా తీస్తుండటంతో చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతోంది. తయారీ రంగం దెబ్బతి టోంది. కంపెనీల అక్కడ నుంచి భారత్‌కు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ఆపిల్‌, సామ్‌సంగ్‌ వచ్చేశాయి. 

పెట్టుబడులకు అత్యంత సురక్షితంగా ఉన్న మార్కెట్‌ భారత్‌ మాత్రమేనని మార్కెట్ మనీ మేనేజర్లు అంటున్నారు. గోల్డ్‌మాన్‌ సాచెస్‌ గ్రూప్‌ చైనాకు అండర్‌ వెయిట్‌ ర్యాంకు ఇచ్చింది. ‘స్థానిక అభివృద్ధి, విధాన సంస్కరణలు, తిరుగులేని రుణాభివృద్ధి భారత మార్కెట్లకు ఊతమిస్తోంది’ అని స్టాండర్డ్‌ ఛార్టెడ్‌ బ్యాంకు ఎస్‌జీ లిమిటెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్టు ఔడ్రె గో అంటున్నారు. భిన్న ధ్రువాలుగా మారుతున్న ప్రపంచం భారత్‌కు లాభమని తెలిపారు.

ఈ వారం భారత స్టాక్‌ మార్కెట్ల విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. సరిగ్గా జీ20 సమావేశాల జరుగుతున్న తరుణంలో ఈ ఘనత సాధించడం ప్రధాని నరేంద్రమోదీకి మరో గుర్తింపు తీసుకొచ్చింది. భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు భారత్‌ పెట్టుబడులకు అత్యంత సురక్షితం అని చాటేందుకు ఆయనకు మళ్లీ అవకాశం దొరికింది. చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలని పశ్చిమ దేశాలు తహతహలాడుతున్న వేళ ప్రత్యేక టారిఫ్‌లు, ఇన్‌సెంటివ్స్‌తో ఆయన పెద్ద కంపెనీలను ఇటువైపు రప్పించారు. ఇప్పటికే ఆపిల్‌, సామ్‌సంగ్‌ ఉత్పత్తిని మొదలు పెట్టాయి. 

విదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాది నికరంగా 16 బిలియన్‌ డాలర్లను భారత స్టాక్‌ మార్కెట్లోకి పంప్‌ చేశారు. చివరి మూడేళ్లలో అత్యధిక నిధుల ప్రవాహం ఇదే కావడం గమనార్హం. చైనా సహా ఎమర్జింగ్‌ మార్కెట్లు గ్లోబల్‌ సెలాఫ్‌తో ఆందోళన చెందగా భారత్‌కు ఇందుకు మినహాయింపు పొందింది. ‘ఆసియాలో నాకు అత్యంత ఇష్టమైన మార్కెట్ భారత్‌’ అని జెఫరీస్‌ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్‌ హెడ్‌ క్రిస్‌ వుడ్‌ అనడం గమనార్హం.

కరోనా మహమ్మారి కనిష్ఠ స్థాయి నుంచి భారత్‌ మార్కెట్లు మూడు రెట్లు వృద్ధి చెందాయి. భారత్‌ ఐదో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. ఇదే సమయంలో అమెరికా రెండు రెట్లే పెరిగింది. ఎన్నికల సమయంలో మార్కెట్లలో స్వింగ్‌ కనిపిస్తుందని, సుదీర్ఘ కాలంలో భారత్‌కు తిరుగులేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఉపాధి అవకాశాలు తగ్గుతాయని భయపడుతున్నా.. విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడ, ఏ ఫండ్‌ హౌజ్‌, మేనేజర్‌ను కదిలించినా భారతే తమ ఫేవరెట్‌ అని చెబుతున్నారు.

Also Read: G20లో ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం, ప్రధాని మోదీ కీలక ప్రకటన

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *