News
oi-Mamidi Ayyappa
Go
First:
వాడియా
గ్రూప్
యాజమాన్యంలోని
గో
ఫస్ట్
విమానయాన
సంస్థ
నిన్న
దివాలా
ప్రక్రియకు
దాఖలు
చేసింది.
విమానాలను
నడిపేందుకు
సైతం
డబ్బు
కొరత
ఏర్పడటంతో
కంపెనీ
తాత్కాలికంగా
తన
సేవలను
నిలిపివేస్తున్నట్లు
పేర్కొంది.
భారతీయ
విమానయాన
సంస్థ
గో
ఫస్ట్
రుణదాతలకు
ఏకంగా
రూ.6,521
కోట్ల
మేర
బకాయి
పడినట్లు
తన
దివాలా
దాఖలు
పత్రాల్లో
వెల్లడించింది.
అయితే
ఏప్రిల్
30
నాటికి
చెల్లించాల్సిన
బకాయిలను
కంపెనీ
డిఫాల్ట్
చేయలేదని
వెల్లడించింది.
కంపెనీ
స్వచ్చందంగా
దివాలా
కోసం
ఫైల్
చేయాలనే
ఎయిర్‌లైన్
ప్లాన్‌ల
గురించి
రుణదాతలకు
తెలియదు.

తాజా
పరిస్థితుల
నేపథ్యంలో
రుణదాతలు
ఎలా
ముందుకు
వెళ్లాలనే
దానిపై
చర్చించేందుకు
సమావేశం
అయ్యే
అవకాశం
ఉన్నట్లు
తెలుస్తోంది.
కంపెనీ
వెల్లడించిన
సమాచారం
ప్రకారం
సెంట్రల్
బ్యాంక్
ఆఫ్
ఇండియా,
బ్యాంక్
ఆఫ్
బరోడా,
IDBI
బ్యాంక్,
యాక్సిస్
బ్యాంక్,
డ్యూయిష్
బ్యాంక్‌లు
గో
ఫస్ట్
సంస్థకు
రుణాలు
ఇచ్చినట్లు
తెలుస్తోంది.
అయితే
ఈ
ప్రభావం
ఎంత
వరకు
ఉంటుందనే
దానిపై
బ్యాంకులు
ఇంకా
అధికారికంగా
వెల్లడించలేదు.
దివాలా
తీసిన
గో
ఫస్ట్
విమానయాన
కంపెనీకి
మెుత్తంగా
రూ.11,463
కోట్ల
మేర
అప్పులు
ఉన్నాయి.
అయితే
ప్రస్తుతం
ఉన్న
ఆస్తులు
అప్పుల
చెల్లింపులకు
సరిపోవని
తెలుస్తోంది.
కంపెనీ
ఆపరేషనల్
క్రెడిటార్లకు
చెల్లింపులను
డిఫాల్ట్
చేసింది.
ఇందులో
విక్రేతలకు
రూ.1,202
కోట్లు,
విమానాల
అద్దెదారులకు
రూ.2,660
కోట్లు
చెల్లించాల్సి
ఉంది.
ఇదే
క్రమంలో
ఎయిర్‌క్రాఫ్ట్
లీజు
ఒప్పందాలను
రద్దు
చేయడానికి
లీజర్‌ల
నుంచి
నోటీసులు
అందాయని..
విమానాలను
తిరిగి
స్వాధీనం
చేసుకునేందుకు
సదరు
కంపెనీలు
చర్యలు
ప్రారంభించాయని
గో
ఫస్ట్
తన
ఫైలింగ్స్‌లో
వెల్లడించింది.
English summary
Bankrupted Go First owes financial institutions and banks 6521 crores, Know impact
Bankrupted Go First owes financial institutions and banks 6521 crores, Know impact
Story first published: Wednesday, May 3, 2023, 10:12 [IST]