గోల్డ్ ధరపై యూఎస్ ఎఫెక్ట్..

అమెరికాలో పరిస్థితులు ఆందోళనకర స్థాయిలకు చేరుకుంటున్న తరుణంలో బంగారానికి తిరిగి డిమాండ్ పుంజుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిఫాల్ట్ కావటం అమెరికా బ్యాంకింగ్ రంగంపై ఆందోళనలను పెంచుతోంది.

ఈ క్రమంలో బంగారం లాభపడింది. ఇదే క్రమంలో ఫిబ్రవరి US నాన్‌ఫార్మ్ పేరోల్ నివేదికలో ఊహించిన దాని కంటే కొంత మృదువైన డేటా(ఎక్కువ ఉద్యోగాలు) కూడా గోల్డ్ రేటు పెరుగుదలకు కారణమైంది.

నిరుద్యోగుల డేటా..

నిరుద్యోగుల డేటా..

అమెరికా లేబర్ మార్కెట్ ఇప్పటికీ బలంగానే ఉన్నప్పటికీ.. అంచనాలకు మించి నిరుద్యోగిత రేటు 3.60 శాతంగా ఉండటం ఆందోళనలకు కారణంగా మారింది. సగటున గంటకు ఆదాయం ఊహించిన దాని కంటే తక్కువగా 4.6 శాతంగా నమోదైంది. దీనికి తోడు శ్రామిక శక్తి భాగస్వామ్యం జనవరిలో 62.40% నుంచి ఫిబ్రవరిలో 62.50%కి పెరగడం కూడా గట్టి జాబ్ మార్కెట్‌కు సంబంధించిన ఆందోళనలను కొంత వరకు తగ్గించడంలో సహాయపడింది.

గ్రోబల్ ఫైనాన్సియల్ క్రైసిస్..

2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత తాజాగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలటం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఎపిసోడ్ గ్రోబల్ ఫైనాన్సియల్ క్రైసిస్ నాటి సమయంలోని నాసిరకం ఆర్థిక వ్యవస్థను గుర్తుకు తెస్తుంది. కాబట్టి ఈ బ్యాంక్ డిఫాల్ట్‌తో పెట్టుబడిదారులు భయభ్రాంతులకు గురయ్యారు. రానున్న ఫెడ్ మానిటరీ పాలసీ సమావేశంలో పావెల్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మార్కెట్ వర్గాలు మాత్రం ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును కోరుతున్నారు.

వారం రోజులుగా బంగారం ధర..

వారం రోజులుగా బంగారం ధర..

గడచిన వారం రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ రేట్ల ప్రకారం.. మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.56,108 వద్ద ముగిశాయి. హోలీ కారణంగా మంగళవారం మార్కెట్‌కు సెలవు. బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టి 10 గ్రాములకు రూ.56,000 నుంచి రూ.55,309కి పడిపోయింది. గురువారం ధరలు రూ.55,121కి తగ్గినప్పటికీ.. శుక్రవారం పసిడి స్వల్పంగా పెరిగి రూ.55,607 వద్ద ముగిసింది.

వచ్చే వారం బంగారం..

వచ్చే వారం బంగారం..

బంగారం వచ్చే వారం క్రెడిట్ రిస్క్ ఆందోళనలపై మంచి మద్దతు పొందే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మంగళవారం అమెరికా CPI ద్రవ్యోల్బణం గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం డేటా కారణంగా మార్కెట్లలో భారీగా అస్థిరతలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు బంగారం డిమాండ్, ధరపై ప్రభావాన్ని చూపుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *