[ad_1]
తలనొప్పి ఎలాంటిందనేది కచ్చితంగా అంచనా వేయడం కష్టమే. వీటిలో కొన్ని ప్రాణాంతకమైన తలనొప్పులూ ఉన్నాయి. వెంటనే తగ్గిపోయే సాధారణ తలనొప్పులు కూడా ఉన్నాయి. తల, మెడ భాగాల్లోని తొమ్మిది సున్నితమైన ప్రాంతాలు, తలలోని రక్త నాళాలు ఒత్తిడికి లోనుకావడం, ఇన్ఫ్లమేషన్ వల్ల తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతారు. అయితే, తరచుగా తలనొప్పి వస్తున్నట్లయితే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా వచ్చే తలనొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
నీళ్లు తాగుతున్నారా..?
అస్తమానం తలనొప్పి వేధిస్తుంటే రోజూ ఎన్ని నీళ్లు తాగుతున్నారో ఒక పరిశీలించండి. డీహైడ్రేషన్ కారణంగానూ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఒంట్లో నీరు తగ్గినప్పుడు మెదడు తాత్కాలికంగా కుంచించుకుపోతుంది. దీంతో మెదడు పుర్రె నుంచి కాస్త వెనక్కి జారి, నొప్పికి దారితీస్తుంది. నీళ్లు తాగితే.. యథాస్థితికి వస్తుంది. నొప్పీ తగ్గుతుంది.
భోజనానికి గ్యాప్ ఇస్తున్నారా..?
భోజనానికీ భోజనానికీ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉన్నా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. మీకు తలనొప్పి వేధిస్తుంటే.. టైమ్‌కు తినే అలవాటు చేసుకోండి. కొందరికి కార్బ్స్, స్వీట్స్ తింటే తల నొప్పి వస్తుంది. వీటిని గమనించి, అవి తినడం మానేయండి.
సరైన భంగిమలో కూర్చోండి..
సరిగా కూర్చోకపోవటం, నిలబడకపోవటం వల్ల తల, మెడ, దవడలు, భుజాల వెనక కండరాలు ఒత్తిడికి గురవుతాయి. ఎక్కువసేపు ఇలాగే ఉండిపోతే అక్కడి నాడుల మీదా ప్రెజర్ పెరుగుతుంది. దీని కారణంగానూ తలనొప్పి వస్తుంది. అదేపనిగా మెడ వంచి ఫోన్ చూసినా తలనొప్పి వస్తుంది. ఇవి గమనించి సరిచేసుకోండి.
మెగ్నీషియం లోపం ఉంటే..
మెగ్నీషియం లోపం ఉన్న వారిలో తరచూ మెగ్రెయిన్ తలనొప్పి ఎక్కువగా వస్తుంది. మీ డైట్‌లో ఆకుకూరలు, ఆకుపచ్చ కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు, డార్క్ చాక్లెట్ ఎక్కువగా తీసుకోండి.
వీటికి దూరంగా ఉండండి..
ఛీజ్, బర్గర్లు, మాంసం… వంటి పదార్థాల్లో హిస్టమైన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి అధికంగా తీసుకోవడం వల్ల చాలా మందిలో మైగ్రెయిన్ సమస్య వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు తలనొప్పితో బాధపడుతుంటే.. వీటికి దూరంగా ఉండండి.
వెంటనే తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
- ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- గోరువెచ్చని పాలు తాగితే.. తలనొప్పి తగ్గుతుంది.
- మీ ఇంట్లో గంధం పౌడర్ ఉంటే. పేస్టులా చేసుకుని తలకు రాసుకోండి.
- అల్లాన్ని నమిలినా తలనొప్పి తగ్గుతుంది.
- తలనొప్పి ఎక్కువగా ఉంటే.. వెలుగు తక్కువగా ఉండే ప్రాంతంలో లెస్ట్ తీసుకోండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply