[ad_1]
Health Care: సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరం. మన శరీరం పనితీరు సక్రమంగా ఉండాలన్నా, ఇన్ఫెక్షన్లతో పోరాటం చేయాలన్నా.. సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొవిడ్ మహమ్మారి కారణంగా ఎంతోమందిలో పోషకాహారంపై అవగాహన పెరిగింది. వారి డైట్‌లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తప్పు పద్ధతిలో తీసుకుంటే.. ఎలాంటి లాభం ఉండదని నిపుణులు అంటున్నారు. ఆహార తయారీ విధానం, వాటిని తినే పద్ధితి.. దానిలో పోషక విలువలను గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. కొన్ని హెల్తీ ఫుడ్స్ తీసుకునేప్పుడు చేయకూడని తప్పులు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.
గుడ్లు..
కొంతమంది గుడ్డులోని పచ్చసొన తినడానికి ఇష్టపడరు, మరికొందరు దానిలో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో గుడ్డులో పచ్చసొన తినకుండా కేవలం ఎగ్ వైట్ మాత్రమే తింటూ ఉంటారు. గుడ్డు పచ్చసొనలో అనేక పోషకాలు ఉంటాయి. దీనిలో మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైన కోలిన్‌తో సహా అనేక పోషకాలు మెండుగా ఉంటాయి. పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ అధికంగా ఉంటాయి. వీటితో పాటు ఫోలికామ్లం, ఐరన్, క్యాల్షియం, కాపర్, సల్ఫర్‌లు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా అవసరం. మీరు గుడ్డు తినేప్పుడు మొత్తం తింటే దానిలో పోషకాలు సంపూర్ణంగా అందుతాయి. గుడ్డును ఉడకబెట్టి, ఆమ్లెట్, సాట్ చేసి మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. (image source- pixabay)
Foods Replace Eggs: గుడ్డు అంటే అలర్జీనా..? ఇవి తింటే గుడ్డులోని పోషకాలు అందుతాయి..!
చేపలు తింటే.. ఈ అనారోగ్యాలు దూరం అవుతాయ్..!
బ్రకోలీ..
బ్రకోలీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని సాధారణంగా.. ఉడకబెట్టి, స్టీమ్ చేసి తింటూ ఉంటారు. అయితే దీన్ని పచ్చిగా కూడా తినొచ్చు. దీన్ని పచ్చిగా తింటే విటమిన్ సి, ఫోలేట్, సల్పోరాఫేన్ వంటి మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. బ్రకోలీ మన డైట్‌లో చేర్చుకుంటే.. క్యాన్సర్‌ను నిరోధించ్చు. బ్రకోలీలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. శరీరంలో వాపును తగ్గిస్తాయి.
(image source – pixabay)
Nails Health: గోళ్లు విరుగుతున్నాయా..? ఈ పోషక లోపం కావచ్చు..!
బీన్స్..
కిడ్నీ బీన్స్ (రాజ్మా), బ్లాక్ బీన్స్ వంటి చిక్కుడు జాతికి చెందిన పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ప్రొటీన్లతో పాటు బి-విటమిన్, ఫైబర్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. అంతేగాకుండా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. కొంతమంది వీటిని నానబెట్టకుండా.. డైరెక్ట్‌గా ఉడకబెట్టి తింటూ ఉంటారు. ఇలా చేస్తే.. గ్యాస్ట్రిక్ సమస్య ఎదురవుతుంది. ఎండిన బీన్స్ రాత్రంతా నానబెట్టి, ఉడికించే ముందు వాటిని బాగా కడగాలి. ఇలా చేస్తే.. గ్యాస్‌కు కారణమయ్యే ఒలిగోశాకరైడ్‌ల పరిమాణం తగ్గుతుంది.
(image source – pixabay)
డార్క్ చాక్లెట్..
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో చక్కెర తక్కువగా, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే, చాక్లెట్‌ను ఎక్కువగా తింటూ ఉంటారు. దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మితంగానే తినాలి. మీరు డార్క్ చాక్లెట్ కొనేముందు 70 శాతం కోకో ఉన్న చాక్లెట్‌ను ఎంచుకోండి. మీరు స్మూతీస్, ఓట్ మీల్‌లో కొంచెం చాక్లెట్ యాడ్ చేసుకోవచ్చు.
(image source – pixabay)
నట్స్..
నట్స్ హెల్తీ స్నాక్స్ ఆప్షన్ అనొచ్చు. అయితే కొంతమంది సాల్టెడ్, వేయించిన డ్రైఫ్రూట్స్‌ను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉప్పు, నూనె మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నట్స్‌ను పచ్చిగా, నానబెట్టి తింటేనే దానిలోని పోషకాలు శరీరానికి సంపూర్ణంగా అందుతాయి. అదేవిధంగా వీటిని మితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(image source – pixabay)
టమాటాలు..
టమాటాలను ఉడికిస్తే.. వాటిలోని లైకోపీన్ పరిమాణం పెరుగుతుంది. లైకోపీన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.. ఇది క్యాన్సర్, గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది. టమాటాలు పచ్చిగా తినడం కంటే.. సూప్‌లు, సాస్‌లు, కూరల్లో యాడ్ చేసుకోవడమే మంచిది.
(image source – pixabay)
అవకాడో..
అవకాడో ఒక సూపర్‌ఫుడ్. చాలా మంది అవకాడో గుడ్డు మాత్రమే తిని దాని లోపల గింజను పారేస్తారు. అయితే, అవకాడో గింజలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మెండుగా ఉంటుంది. అవకాడో గింజను స్మూతీ, సలాడ్ డ్రెస్సింగ్‌లో యాడ్ చేసుకోవచ్చు.
(image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply