[ad_1]
జీన్స్..
జీన్-హార్వర్డ్ మెడికల్ వెబ్‌సైట్ ప్రకారం, పిండం దశ నుంచే.. స్త్రీలు, పురుషుల లక్షణాలు వేరేగా ఉంటాయి. ఇద్దరికీ 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి.. వీటిలో 22 జతల క్రోమోజోమ్‌లు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి, కానీ 23వ జత భిన్నంగా ఉంటుంది. మగవారికి 23వ జతలో X&Y క్రోమోజోమ్ ఉండగా, ఆడవారికి రెండూ X క్రోమోజోమ్‌లు ఉంటాయి.
Y క్రోమోజోమ్ X క్రోమోజోమ్ కంటే మూడింట ఒక వంతు తక్కువగా ఉంటుంది, X కంటే తక్కువ జీన్స్ ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పురుషులలో కొన్ని Y క్రోమోజోమ్‌లు వ్యాధులతో ముడిపడి ఉంటాయి, పురుషులు త్వరగా మరణించడానికి ఇదే కారణం.
హార్మోన్..
పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తుంది, దీని కారణంగా గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది. మరోవైపు, మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్, గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కాబట్టి అధ్యయనాల ప్రకారం, మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా ఉంటాయి.
పునరుత్పత్తి అవయవాలు
మగవారిలో ప్రోస్టేట్ గ్రంధి అనేక సమస్యలకు కారణం అవుతుంది. అయితే, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ కేసులు చూస్తుంటే.. ఈ విషయంలో మగవారు సేఫ్‌గా ఉన్నారని మీకు అనిపించవచ్చు. కానీ రిపోర్టుల ప్రకారం పురుషులు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.
జీవక్రియ..
మహిళలలో గుండెను రక్షించే మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, స్త్రీలలో మంచి కొలెస్ట్రాల్ డెసిలీటర్‌కు 60.3 మిల్లీగ్రాములు ఉంటుంది, పురుషులలో ఇది 48.5 మాత్రమే ఉంటుంది . ఇది గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ కారణంగా.. ఊబకాయం, ఇతర వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుంది. దీంతో మహిళలో జీవక్రియ చురుకుగా ఉంటుంది.
జీవన శైలి..
పరిశోధనల ప్రకారం.. పురుషుల కంటే మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. మహిళలు ఎక్కువగా ఇంటిపని చేస్తారు, దీని వల్ల వారు శారీరకంగా యాక్టివ్‌గా ఉంటారు. దీంతో వారు రోగాల బారిన తక్కువగా పడుతుంటారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply