[ad_1]
బరువు తగ్గాలంటే ఈ పని చెయ్యండి
అధిక పొట్ట తగ్గాలంటే అన్నానికి బదులుగా కొర్రలు , ఓట్స్, జొన్నలు, రాగులు, కందులు, ఉలవలు మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవాలి. బీర, సొర, పొట్ల వంటి కాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం ఊబకాయం తగ్గడానికి సహకరిస్తుంది. ఇక పొట్ట తగ్గాలని భావించేవారు పగటిపూటనిద్ర కు స్వస్తి చెప్పాలి. ఎట్టి పరిస్థితులలోను పగటిపూటనిద్ర మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
ఇవి తినటం మానేయ్యండి
ఇక పొట్ట తగ్గించుకునే కాలేయం పనితీరును పెంచే ఆసనాలు వేయడం వల్ల కూడా కాలేయం పనితీరు మెరుగుపడి ఊబకాయం కాస్త తగ్గుతుందని చెబుతున్నారు. ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, బయట తినుబండారాలు, పిండివంటలు తినకుండా ఉండటం, స్వీట్లు తినడం మానేయడం అధిక పొట్టను తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మితంగా భోజనం చేయడం, భోజనం చేసే అరగంట ముందు నీళ్లు బాగా తాగడం చెయ్యాలని చెబుతున్నారు.
ఎక్కువగా నీళ్ళు తాగటం.. మితంగా ఆహారం తీసుకోవటంతో కలిగే ఫలితం ఇదే
భోజనం చేసే సమయంలో నీటిని తాగడానికి స్వస్తి పలకాలని, భోజనం పూర్తయిన రెండు గంటల తర్వాత మళ్ళీ నీటిని తాగాలని చెబుతున్నారు. ఇక ప్రతిరోజూ ప్రతి అర గంటకు కొంచెం కొంచెం గా నీటిని తాగాలని అలా నీటిని తాగడం వల్ల పొట్ట తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తీసుకునే ఆహారం ఎప్పుడూ మితంగా తీసుకోవాలని, రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు తినాలి అని చెబుతున్నారు. ఆహారంలో ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోవాలని రాత్రి సమయంలో ఆకలేస్తే పండ్లు గాని వెజ్ సలాడ్ కానీ తినవచ్చని చెబుతున్నారు.
బరువు తగ్గటం కోసం ఈ గింజలు బాగా ఉపయుక్తం
ఇక రాత్రి భోజనం 7 గంటల లోపే చెయ్యాలని సూచిస్తున్నారు. ఇక అధిక బరువును తగ్గించడంలో బార్లీ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. బార్లీ గింజలను గంజి చేసుకొని తాగడం వల్ల అధిక బరువు గణనీయంగా తగ్గుతుందని, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇక బరువును తగ్గించడంలో తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకొని పరగడుపున తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
ఇవి తాగితే అధిక పొట్ట మాయం
నిమ్మరసం, తేనె కూడా బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ ఉదయం పూట తీసుకుంటే అది బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది మొత్తంగా చూస్తే వ్యాయామం చేయడంతో పాటుగా, మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం మన బరువును తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. కాబట్టి ఈ విషయాలను అర్ధం చేసుకుని బరువు తగ్గించుకోవటానికి ప్లాన్ చేసుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
health tips: పాదాలకు నిద్రకు లింక్.. మంచి నిద్రకోసం ఇలా చేసి చూడండి!!
[ad_2]
Source link