[ad_1]
పసుపు, మిరియాల వాటర్..
ఉదయం ఖాళీ కడుపుతో పసుపు, మిరియాల వాటర్ తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీళ్లలో చిటికెడు పసుపు, రెండు చిటికెళ్ల నల్ల మిరియాల పొడి వేసి తీసుకోండి. ఈ శక్తివంతమైన డ్రింక్ జీవక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగిస్తుంది.
Health Care: రోజూ 5 నిమిషాలు ఈ పని చేస్తే.. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది..!
జీరా- సోంపు – వాము వాటర్..
రెండు కప్పుల నీరు తీసుకుని అందులో చిటికెడు జీలకర్ర, సోంపు, వాము వేసి మరిగించండి. ఈ నీరు సగం వరకు మరిగిన తర్వాత, దాన్ని వడకట్టి గోరువెచ్చగా అయిన తర్వాత తాగండి. ఈ డ్రింక్ జీవక్రియను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. నెరసరి సమస్యతో బాధపడేవారు ఈ డ్రింక్ తాగితే ఉపశమనం లభిస్తుంది.
నిమ్మరసం నీళ్లు..
గోరువెచ్చని నీళ్లో సగం నిమ్మచెక్క రసం పిండండి. ఈ నీళ్లలో ఒక టీ స్పూన్ తేనె మిక్స్ చేయండి. ఈ పానీయాన్ని మరింత శక్తివంతంగా చేయడానికి, మీరు చిటికెడు దాల్చినచెక్క పొడిని కూడా కలపండి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే.. శరీరం నుంచి టాక్సిన్ క్లీన్ అవుతాయి. జీవక్రియను మెరుగుపరచి.. కొవ్వును కరిగిస్తుంది. ఇది మీ చర్మాన్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది.
High Calcium Foods:పాలు తాగరా..? ఈ 5 కాల్షియం రిచ్ ఫుడ్స్ మీ కోసమే..!
గోరువెచ్చని నీళ్లు..
ఉదయం పూట మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనుకుంటే, ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. ది మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. గోరువెచ్చని నీళ్లు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతాయి.
టీ కాఫీ ఎప్పుడు తాగాలి..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తాగిన తర్వాత, నానబెట్టిన బాదం, గుమ్మడి వంటి గింజలు తినండి. మీకు ఏదైనా తీపి పదార్థం తినాలనుకుంటే.. ఎండుద్రాక్ష, ఖర్జూరం, తాజా పండ్లు తినండి. వీటిలో ఏదైనా తిన్న తర్వాత, మీరు టీ, కాఫీ తొగొచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply