Homemade Mouthwashes: దంతాలు, చిగుళ్లు దృఢంగా ఉంచుకోవడానికి, నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ రోజుల్లో నోటి దుర్వాసన నుంచి బయటపడటానికి చాలామంది మౌత్ వాష్‌ని వాడుతున్నారు. ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకున్న తర్వాత మౌత్‌వాష్‌తో నోరు పుక్కిలించడం మనలో చాలామంది చేసేదే. దంతాలు-చిగుళ్ల ఆరోగ్యానికి, నోటి దుర్వాసనను దూరం చేయడానికి ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. అయితే, మార్కెట్లో లభించే మౌత్‌వాష్‌లోని కెమికల్స్ మన నోట్లోని చెడు బ్యాక్టీరియాతో పాటుగా మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతుందని కొన్ని పరిశోధనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు ఇది నోటి ఆరోగ్యకరమైన సూక్ష్మజీవిని నిర్వహించే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో మౌత్ వాష్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
Source link
