News
lekhaka-Bhusarapu Pavani
insurance:
దేశంలోని
జీవిత
బీమా
సంస్థల
ఆదాయం
ఏప్రిల్
లో
దారుణంగా
పడిపోయింది.
అయితే
కొత్త
ప్రీమియంలలో
ప్రభుత్వ
సంస్థ
లైఫ్
ఇన్సూరెన్స్
కార్పొరేషన్
ఆఫ్
ఇండియా(LIC)ని
మించి
ప్రైవేట్
సంస్థలు
ఆర్జించాయి.
గతేడాది
ఏప్రిల్‌తో
పోలిస్తే
యాన్యులైజ్డ్
ప్రీమియం
ఈక్వివలెంట్
(APE)
6
శాతం
తగ్గింది.
రిటైల్
వెయిటెడ్
ప్రీమియం
అయితే
గత
సంవత్సరం
కంటే
3
శాతం
మేర
క్షీణించింది.
లైఫ్
ఇన్సూరెన్స్
కౌన్సిల్
విడుదల
చేసిన
తాత్కాలిక
డేటా
ప్రకారం..
గత
నెలలో
పరిశ్రమ
మొత్తంగా
కొత్త
వ్యాపార
ప్రీమియం
12
వేల
565
కోట్లుగా
ఉంది.
గతేడాది
ఏప్రిల్‌తో
పోలిస్తే
30
శాతం
క్షీణత
నమోదైంది.
విక్రయించిన
పాలసీల
మొత్తం
సంఖ్యలో
10
శాతం
తగ్గుదల
ఏర్పడింది.
సంపూర్ణ
ఆదాయం
52
వేల
81
కోట్ల
నుంచి
76
శాతం
పడిపోయింది.

మార్చితో
పోలిస్తే
మొత్తం
విక్రయించిన
పాలసీల
సంఖ్యలో
కూడా
78
శాతం
తగ్గుదల
నమోదైంది.
2024
ఆర్థిక
సంవత్సరంలో
జీవిత
బీమా
రంగం
బాగా
వృద్ధి
చెందుతుందని,
పొదుపు
పెంచుకోవడానికి
తోడ్పడుతుందని
IIFL
సెక్యూరిటీస్
లిమిటెడ్
ఒక
నివేదికలో
పేర్కొంది.
మొదటి
త్రైమాసికం
అందులోనూ
ముఖ్యంగా
ఏప్రిల్
మరియు
మే
లో..
ఈ
రంగం
వృద్ధి
బలహీనంగా
ఉంటుందని
అంచనాలు
ఉన్నాయి.
కొత్త
పన్నుల
అమలు
కారణంగా
జీవిత
బీమా
రంగం
దిద్దుబాటును
ఎదుర్కొన్నప్పటికీ,
FY24లో
విస్తృత
మార్కెట్లను
అధిగమిస్తుందని
భావిస్తున్నట్లు
IIFL
వెల్లడించింది.
ప్రైవేట్
బీమా
కంపెనీల
కొత్త
వ్యాపార
ప్రీమియం
ఏప్రిల్
లో
6
వేల
755
కోట్లుగా
ఉంది.
ఇది
సంవత్సరానికి
9
శాతం
పెరిగింది.
దాని
రిటైల్
వెయిటెడ్
ప్రీమియం
గతేడాది
కంటే
1
శాతం
తగ్గింది.
అయితే
మార్చిలో
మాత్రం
79
శాతం
క్షీణించింది.
ఏప్రిల్
1
నుంచి
ఇటీవల
ప్రవేశపెట్టిన
పన్ను
విధానంలో
మార్పు
కారణంగాను,
మార్చిలో
అమ్మకాలు
జరగడం
వల్ల
ఆ
నెల
మంచి
వృద్ధి
నమోదైంది.
LIC
ఆదాయం
ఏప్రిల్
లో
5
వేల
810
కోట్లు.
కొత్త
బిజినెస్
ప్రీమియం
గతేడాది
ఇదే
సమయానికి
50
శాతం
మరియు
మార్చిలో
80
శాతం
తగ్గింది.
ప్రైవేట్
రంగం
పనితీరు
మాత్రం
ఆశించిన
స్థాయిలోనే
ఉంది.
English summary
Life Insurance premium slashed 30% in April
Life Insurance premium slashed 30% in April
Story first published: Wednesday, May 17, 2023, 7:06 [IST]