[ad_1]
Intestine Cleansing Foods: మీకు కడుపు ఎప్పుడూ ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుందా..? కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందా..? తరచు ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు..? మీ జవాబు అవును అయితే.. మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. దీనికి ప్రధాన కారణం.. మీ కడుపులో, పేగులలో పేరుకుపోయిన చెత్త. కడుపు, పేగుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా రక్షించుకోవడం చాలా ముఖ్యం, తద్వారా మన జీర్ణవ్యవస్థ మెరుగ్గా, బలంగా మారుతుంది. మంజి జీర్ణక్రియ.. మంచి ఆరోగ్యానికి సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మీ జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోయినా, నెమ్మదిగా పనిచేస్తున్నా.. మనం తీసుకున్న ఆహారం, పానీయాలు సరిగ్గా జీర్ణం కావు, అవి పేగులలో పేరుకుపోతాయి. వాటిలోని పోషకాలు మన శరీరం సరిగ్గా శోషించుకోలేదు. పేగులలో పేరుకున్న చెత్త, వ్యర్థాలు, టాక్సిన్స్‌ను తొలగించే సులభమైన మార్గాలను డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ మనకు వివరించారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
ప్రొబయోటిక్స్ ఎక్కువగా తీసుకోండి..
ప్రోబయోటిక్స్ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి పని చేస్తాయి. పేగులలో ఉన్న చిన్న బ్యాక్టీరియానూ.. ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి తోడ్పడతాయి. కడుపులోని మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియకు మేలు చేస్తుంది, కడుపులో, పేగులలోని చెత్తను క్లీన్ చేస్తుంది. ఇందుకోసం ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు, పులియబెట్టిన పదార్థాలు, మజ్జిగ, ఛీజ్.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ అన్నారు.
Health Care: టీతో బిస్కెట్ తింటున్నారా..? అయితే ఈ సమస్యలు వస్తాయ్ జాగ్రత్త..!
అపెండెక్స్ ఎందుకు వస్తుంది.. ట్రీట్‌మెంట్ ఏంటి..
సరిపడా నీళ్లు తాగండి..
కడుపు, పేగులలోని వ్యర్థాలను బయటకు పంపడానికి, పేగు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మీరు ప్రతిరోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీరు త్రాగాలి. నీళ్లు కడపులోని చెత్తను, టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. సరిపడా నీళ్లు తాగితే.. మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలకూ చెక్ పెట్టవచ్చు.
ఫైబర్ రిచ్ ఫుడ్స్..
గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, జీర్ణవ్యవస్థను వేగవంతం చేయడానికి మీరు తీసుకునే ఆహారంలో డైటరీ ఫైబర్ మొత్తాన్ని పెంచాలి. ఫైబర్ జీర్ణకోశ వ్యవస్థ సజావుగా పనిచేయటానికి తోడ్పడుతుంది. బరువు తగ్గటానికి, పేగుల్లో బ్యాక్టీరియా సమతులంగా ఉండటానికీ దోహదం చేస్తుంది. మీ డైట్‌లో ఫైబర్ అధికంగా ఉంటే.. తృణధాన్యాలు, పండ్లు, కాయగూరలు, పప్పులు, నట్స్, గింజలు చేర్చుకోండి.
పండ్లు తినండి..
చాలా మంది పండ్లు తినడం కంటే.. ఫూట్ జ్యూస్‌లు తాగడానికే ఇష్టపడుతుంటారు. అయితే, మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ అలవాటును మార్చుకోవడమే మంచిది. కడుపు, పేగులలోని మురిగిని తొలగించడానికి, మీరు జ్యూస్‌కు బదులుగా, పండ్లు తినండి. పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కొంచెం కొంచెం తినండి..
కొంత మంది ఒకేసారి ఎక్కువగా తింటూ ఉంటారు. దీనికి బదులుగా, రోజుకు చాలా సార్లు, కొంచెం కొంచెం తినండి. ఇలా చేయడం వల్ల జీర్ణ యంత్రంపై ఒత్తిడి ఉండదు, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఈ అలవాటు పొట్టను శుభ్రంగా ఉంచుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply