News
oi-Chekkilla Srinivas
ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌తో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించిన ఏపీకి తాజాగా రెండు భారీ పెట్టుబడులు రానున్నాయి. యాంప్లస్ సోలార్ రూ. 1,500 కోట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా రూ. 250 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. 7.5 కేపీటీఏ సామర్థ్యంతో హరిత హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాంప్లస్ సోలార్ ప్రకటించింది.
ఈ హైడ్రోజన్ ప్లాంట్ ను పారిశ్రమిక అవసరాలు తీర్చడానికి నెలకొల్పనున్నట్లు యాంప్లస్ ఎండీ, సీఈఓ శరద్ పుంగాలియా తెలిపారు. భారత్ పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయంగా ఇతర ఇంధనాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. పెట్రోకెమికల్స్, సిమెంటు, ఎరువులు తదితర రంగాల సంస్థలకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక హబ్‌గా మారుతుంది. జీఐఎస్ ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.

కడపలో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా తెలిపింది. వచ్చే అయిదేళ్లలో దశలవారీగా రూ. 250 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. మొదటి విడతగా రూ. 50 కోట్లు పెట్టనున్నారు. ఈ ప్లాంటులో ఏటా పది లక్షల పైచిలుకు స్మార్ట్ యూనిట్లు, మానిటర్లను తయారు చేయనున్నారు.
English summary
Amplus solar and elista will investments in Andrapradesh
Investments are pouring into Andhra Pradesh. AP, which attracted the attention of investors with the Global Investment Summit a few days ago, is about to make two huge investments.
Story first published: Wednesday, March 22, 2023, 13:27 [IST]