[ad_1]
Irritable Bowel Syndrome: ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే పెద్ద పేగులను ప్రభావితం చేసే.. సాధారణ జీర్ణశయాంతర రుగ్మత. ఇదో దీర్ఘకాల సమస్య. దీని బారినపడితే కడుపునొప్పి, కడుపుబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం వంటివి తరచుగా వేధిస్తుంటాయి. ఇలాంటివారు ఆహారం విషయంలో.. ముఖ్యంగా అంతగా జీర్ణం కాని పిండి పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇలాంటి జీర్ణం కాని పిండి పదార్థాలు పేగుల్లోకి చేరినప్పుడు అక్కడి బ్యాక్టీరియా వాటితో రసాయనిక చర్యలు మొదలెడుతుంది. దీంతో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలకు దారితీస్తుంది. IBS తో బాధపడేవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు IBS లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తే, మరికొన్ని ఈ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్‌తో బాధపడేవారు ఏ ఆహారం తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలో ఈ స్టోరీలో చూద్దాం.
[ad_2]
Source link
Leave a Reply