ISRO: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్.. ఇస్రో రాకెట్ ప్రయోగం ఆలస్యం

[ad_1]

ISRO: ప్రపంచ దేశాలన్నీ విశ్వం గురించి.. ఇతర గ్రహాల గురించి తెలుసుకునేందుకు అంతరిక్షంలోకి రాకెట్లను పంపి ప్రయోగాలు చేస్తూ ఉంటాయి. అయితే ఇలా పంపించిన ఉపగ్రహాలకు చెందిన వ్యర్థాలు అంతరిక్షంలోనే పేరుకుపోతున్నాయి. దీంతో స్పేస్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో చేపట్టిన ప్రయోగం ఒకటి ఆలస్యం అయింది. అయితే అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాలకు సంబంధించి ఇటీవల ఇస్రో ఓ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అంతరిక్షంలో దాదాపు 27 వేల వ‌స్తువులు ఉన్న‌ట్లు ఇస్రో గుర్తించింది. అందులో 80 శాతం వ‌ర‌కు ఉన్న వస్తువులన్నీ భూమి నుంచి వివిధ దేశాలు పంపించిన ఉప‌గ్ర‌హ శిథిలాలే ఉన్నాయని ఇస్రో వెల్లడించింది. 10 సెంటీమీట‌ర్ల క‌న్నా త‌క్కువ సైజ్‌లో ఉన్న వ‌స్తువులైతే ల‌క్ష‌ల సంఖ్య‌లో పేరుకుపోయి ఉంటాయ‌ని ఇస్రో ఛైర్మన్ సోమ‌నాథ్ తెలిపారు. వీటితోపాటు యాంటీ శాటిలైట్ ప‌రీక్ష‌ల కారణంగా పేరుకుపోయిన అంత‌రిక్ష వ్య‌ర్ధాలు కూడా ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు ఇస్రో తాజాగా అంచ‌నా వేసింది. అయితే ఈ వ్యర్థాలు దాదాపు చైనా, అమెరికా, భారత్, ర‌ష్యా దేశాలు చేపట్టిన ప్రయోగాల వ‌ల్లనే ఏర్పడిన‌ట్లు సమాచారం. అంత‌రిక్షంలో వ్య‌ర్ధాల‌న్నీ చేరి.. ట్రాఫిక్ జామ్ కావ‌డం వ‌ల్లే.. జులై 30 వ తేదీన నిర్వ‌హించిన పీఎస్ఎల్వీ -సీ56 ప‌రీక్ష ఆల‌స్య‌మైంద‌ని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్న‌ారు.

ఈ సందర్భంగా తాజా ప్రయోగం ఆలస్యం, అందుకు కారణాలను సోమనాథ్ వివరించారు. శ్రీహ‌రికోటపై ఉన్న అంత‌రిక్ష ప్రాంతంలో చాలా వ్య‌ర్ధాలు పేరుకుపోయి ఉన్నాయ‌ని చెప్పారు. అందుకే జులై 30 వ తేదీన ప్రయోగించిన రాకెట్ ప్ర‌యోగాన్ని ఒక నిమిషం ఆల‌స్యంగా చేపట్టినట్లు ఇస్రో చీఫ్‌ తెలిపారు. ఉద‌యం 6 గంటల 30 నిమిషాల‌కు చేప‌ట్టాల్సిన పీఎస్ఎల్వీ -సీ56 ప్ర‌యోగాన్ని.. ఉద‌యం 6 గంటల 31 నిమిషాల‌కు చేప‌ట్టినట్లు వివరించారు. 500 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న భూక‌క్ష్య‌లో స్పేస్ వ‌స్తువులు ఎక్కువైనందు వ‌ల్లే ఆ ప్ర‌యోగం ఆల‌స్యం జ‌రిగింద‌ని సోమ‌నాథ్ వెల్లడించారు. ఇక ఇస్రో ఇటీవల చేపట్టిన ఈ పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రాకెట్‌లోని నాలుగో దశ ద్వారా ఇస్రో గత నెల 30 న ఏడు విదేశీ ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. అయితే దీన్ని అక్కడి నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి తగ్గించింది. ఈ కక్ష్య మార్పు ప్రక్రియను చేపట్టేందుకు ఆదివారం లోథ్రస్ట్‌ ఇంజన్లను రెండుసార్లు మండించి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇలా తక్కువ ఎత్తుకి రావడం వల్ల ఇది త్వరగా భూకక్ష్యలోకి ప్రవేశించి పడిపోతుంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వ్యర్థాలు తగ్గుతాయి.

10 సెంటీమీట‌ర్ల పరిమాణం క‌న్నా పెద్దగా ఉన్న అంత‌రిక్ష వ్య‌ర్ధాలు 26,783 ఉన్న‌ట్లు అమెరికన్ స్పేస్ క‌మాండ్ అంచ‌నా ప్ర‌కారం తెలుస్తోంది. ఇందులో 40 శాతం స్పేస్ వ్య‌ర్ధాలు అమెరికా ప్రయోగించిన ఉపగ్రహాల ద్వారా వచ్చి చేరినవేనని ఈ యూఎస్ స్పేస్ కమాండ్ పేర్కొంది. ఇక ర‌ష్యాకు చెందిన‌వి 28 శాతం, చైనాకు చెందిన‌వి 19 శాతం ఉన్న‌ట్లు ఇస్రో త‌న నివేదికలో వెల్లడించింది. ఇక భారత్ చేపట్టిన ప్రయోగాల వ‌ల్ల ఏర్ప‌డిన అంత‌రిక్ష వ్య‌ర్ధాలు కేవలం 217 వ‌స్తువులు మాత్ర‌మేని.. అది మొత్తం వ్యర్థాల్లో కేవ‌లం 0.8 శాతం మాత్ర‌మేనని ఇస్రో త‌న నివేదికలో పేర్కొంది.

Chandrayaan 3: ఏడాదిన్నరగా అందని జీతాలు.. అయినా చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలకపాత్ర

Chandrayaan 3: చంద్రునిపైకి చేరేందుకు ఒక్క అడుగే.. చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక దశ పూర్తి
Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *