ISRO శాస్త్రవేత్తల సాలరీలు తక్కువే.. ‘దేశం’ కోసం పనిచేయడమే ప్రాధాన్యం

[ad_1]

ISRO: ఒక విజయం వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. ఆ గెలుపుతో ఎన్నో రోజులు పడ్డ శ్రమ, కష్టాన్ని మరిచిపోయి ఆనందంలో ఉప్పొంగిపోతారు. ఇక దేశం కోసం ఇస్రో చేపట్టే ప్రతిష్ఠాత్మక ప్రయోగాల వెనుక శాస్త్రవేత్తల.. కొన్ని ఏళ్ల శ్రమ దాగి ఉంటుంది. కుటుంబాలకు దూరమై.. సంతోషాలు, ఇష్టాలు అన్నీ పక్కన పెట్టి.. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ఒకే ప్రాజెక్టుపై ఉండి.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఇక జీతాల గురించి పట్టించుకోకుండా తాము ఎంచుకున్న రంగంలో పనిచేస్తూనే దేశానికి తమ వంతు సేవను అందిస్తూ నిస్వార్థ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్.. తాజాగా ఇస్రో చేపట్టే ప్రయోగాలు, వాటికి అయ్యే ఖర్చులు, ప్రయోగాల వెనక సేవలు అందించే శాస్త్రవేత్తల జీతాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఇస్రో శాస్త్రవేత్తలు డబ్బును పట్టించుకోరని.. వారి దృష్టి మొత్తం ఎప్పుడూ మిషన్‌ పైనే ఉంటుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని శాస్త్రవేత్తలు తీసుకునే జీతాల్లో ఐదో వంతు మాత్రమే మన శాస్త్రవేత్తలు తీసుకుంటారని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతోనే ఇస్రో ప్రయోగాలు చేయటంపై స్పందించిన మాధవన్.. ఇస్రో శాస్త్రవేత్తల్లో మిలియనీర్లు ఎవరూ లేరని.. వాళ్లంతా సాధారణ జీవితాన్నే గడుపుతారని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల ఏకాగ్రత మొత్తం ప్రయోగాలు, మిషన్‌లపైనే ఉంటుందని వెల్లడించారు. అలాంటి దృఢ సంకల్పం ఉంటుంది కాబట్టే ఉన్నత శిఖరాలకు చేరుకున్నామని పేర్కొన్నారు. సరైన ప్రణాళిక, దూరదృష్టితోనే ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 లాంటి ఘనతను సాధించారని వివరించారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్ ప్రయోగాలు చేపట్టి ఇస్రో విజయం సాధిస్తుందని తెలిపారు. దీంతోపాటు 30 ఏళ్ల క్రితం పీఎస్‌ఎల్‌వీకి వినియోగించిన ఇంజిన్‌నే ఇప్పటికీ జీఎస్‌ఎల్‌వీలో కూడా ఇస్రో వాడుతోందని మాధవన్‌ నాయర్‌ గుర్తు చేశారు.

ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో ఇస్రో ఇన్ని ఘన విజయాలు సాధించడంపైన కూడా మాధవన్ నాయర్ స్పందించారు. అంతరిక్ష పరిశోధనలకు సొంతంగా తయారు చేసి అభివృద్ధి చేసుకున్న టెక్నాలజీని ఇస్రో ఉపయోగిస్తోందని తెలిపారు. అందుకే ప్రయోగ ఖర్చు భారీగా తగ్గుతోందని వెల్లడించారు. భారత్‌ చేపడుతున్న అంతరిక్ష పరిశోధనలు ఇతర దేశాల ప్రయోగాల కంటే 50 నుంచి 60 శాతం తక్కువ ఖర్చుతోనే పూర్తి చేస్తోందని చెప్పారు. ఇందుకు మరో కారణం.. సైంటిస్ట్‌లు, టెక్నీషియన్లు, ఇతర ఉద్యోగాల వేతనాలు కూడా తక్కువగా ఉండటం ఓ కారణమని వివరించారు.

విశ్వంలోని గ్రహాల అన్వేషణ, ప్రయోగాల కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాల్లో చంద్రయాన్‌ 3 ఘన విజయం.. మొదటి అడుగు అని మాధవన్ నాయర్ తెలిపారు. ఇప్పటికే అమెరికా, యూరప్‌లతో భారత్‌ ఒప్పందాలు చేసుకుందని.. చంద్రయాన్‌ 3 విజయంతో అవి మరింత వేగంగా ముందుకు వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 సాధించిన విజయంతో భారత టెక్నాలజీ సామర్థ్యం, వ్యోమనౌక, లాంచింగ్‌ వ్యవస్థల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలను అందుకున్నాయని మాధవన్‌ నాయర్‌ స్పష్టం చేశారు.

Chandrayaan 3: ఏడాదిన్నరగా అందని జీతాలు.. అయినా చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలకపాత్ర

ISRO chief: చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ఎందుకు.. చెప్పేసిన ఇస్రో చీఫ్ సోమనాథ్
Read More Latest National News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *