Juices fight acid reflux: ఈ డ్రింక్స్‌ తాగితే.. కడుపు ఉబ్బరం, కడుపులో మంట చిటికెలో తగ్గుతాయ్..!

[ad_1]

Juices fight acid reflux: మీరు తరుచుగా కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? ఇవి, యాసిడ్‌ రిఫ్లక్స్‌ సంకేతాలు కావచ్చు. యాసిడ్‌ రిఫ్లక్స్‌ అంటే.. కడుపులోని యాసిడ్‌ అన్నవాహికపైకి ప్రయాణించి ఛాతీలో మంట ఇబ్బంది పెడుతుంది. ఇది తరచుగా జరుగుతూ ఉంటే.. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD)కి దారి తీస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో యాసిడ్‌ రిఫ్లక్స్‌ సమస్య మరింత వేధిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, చమట, మండే వేడి.. జీర్ణవ్యవస్థను పాడుచేస్తుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని డ్రింక్స్‌ సహాయపడతాయి. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

కొబ్బరి నీళ్లు..

కొబ్బరి నీళ్లు..

వేసవి వేడిని తట్టుకోవడానికి.. బెస్ట్‌ రిఫ్రెష్‌మెంట్‌ డ్రింక్‌ కొబ్బరి నీళ్లు. ఇది డీహైడ్రేషన్‌, ఎండవేడిని తగ్గించడమే కాదు.. జీర్ణక్రియ సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడతాయి. కొబ్బరి నీళ్లు కడుపుని శాంతపరుస్తుంది. ప్రేగు కదలకలను సులభతరం చేస్తుంది. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఎసిడిటీతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగితే.. ఉపశమనం లభిస్తుంది. కొబ్బరినీళ్లలోని ఆల్కలీన్‌ గుణాలు.. ఎసిడిటీకి చెక్‌ పెడతాయి. ఇవి pHను బ్యాలెన్స్‌ చేస్తాయి.

(image source – pixabay)

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసే డ్రింక్స్

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసే డ్రింక్స్

సోంపు నీళ్లు..

సోంపు నీళ్లు..

భోజనం తర్వాత సోంపు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. యాసిడ్‌ రిఫ్లక్స్‌తో బాధపడేవారికి సోంపు నీళ్లు ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. సోంపులో అనెథోల్, ఫెంచోన్‌, ఎస్ట్రాగోల్‌ ఉంటాయి. ఇవి యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. సోంపు నీళ్లు తాగితే.. మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి.

High Cortisol Level: శరీరంలో ఈ హార్మోన్‌ ఎక్కువ రిలీజ్‌ అయితే.. పొట్ట పెరుగుతుంది..!

హెర్బల్‌ టీలు

హెర్బల్‌ టీలు

కడుపులో అసౌకర్యంగా ఉంటే.. హెర్బల్‌ టీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. యాసిడ్‌ రిఫ్లక్స్‌ నుంచి ఉపశమనం పొందడానికి హెర్బల్‌ టీ తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. హెర్బల్‌ టీలలో యాంటీఇన్ఫ్లమేషన్‌ గుణాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి. మీరు గుండెలో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటే.. అల్లం టీ, చమోమిలే టీ వంటి హెర్బల్‌ టీలు తీసుకోండి.

కలబంద జ్యూస్‌..

కలబంద జ్యూస్‌..

కలబందలో జీర్ణ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇది మన ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD), గ్యాస్‌, కడుపుబ్బరం వంటి సమస్యలకు కలబంద ఔషధంలా పనిచేస్తాయి. ఉదయాన్నే కొద్ది మొత్తంలో కలబంద రసం తాగితే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (GERD) వచ్చే ముప్పును తగ్గించవచ్చని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Rare Heart Conditions: మీరు వినని అరుదైన గుండె సమస్యలు ఇవే..!

వెజిటెబుల్ స్మూతీస్..

వెజిటెబుల్ స్మూతీస్..

మీరు యాసిడ్ రిఫ్లక్స్ నుంచి ఉపశమనం పొందాలనుకుంటే.. మీ డైట్‌లో వెజిటెబుల్‌ స్మూతీలను తీసుకోండి. కానీ వాటిలో వాడే పదార్థాలు.. ఎలాంటి రియాక్షన్స్‌ ప్రేరేపించకుండా చూసుకోండి. బచ్చలికూర, కాలే , కీరా వంటి కూరగాయలో.. ఆల్కలీన్‌ అధికంగా ఉంటుంది. ఇవి గట్‌ను శాంతపరుస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *