KFin Technologies IPO: ఐపీవో ధరను ప్రకటించిన కంపెనీ.. డిసెంబర్ 19న ఇష్యూ ప్రారంభం..

[ad_1]

కొత్త వారంలో.. కొత్త ఐపీవో..

కొత్త వారంలో.. కొత్త ఐపీవో..

దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి వరుసగా అక్టోబర్ నుంచి ఐపీవోలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీవోలలో ఇన్వెస్ట్ చేసేవారు సంబరాలు చేసుకుంటున్నారు. ఏదైనా ఒక ఐపీవోలో షేర్లు పొందకపోయినప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రస్తుతం మరో ఐపీవో వచ్చేస్తోంది కాబట్టి. ఈ క్రమంలోనే KFin టెక్నాలజీస్ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ను నేడు ప్రకటించింది.

ఐపీవో ధర..

ఐపీవో ధర..

డిసెంబర్ 19న ఓపెన్ అవుతున్న KFin టెక్నాలజీస్ ఐపీవో షేర్ల ధరను రూ.347 నుంచి రూ.366గా కంపెనీ నిర్ణయించింది. యాంకర్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రయిబ్ కోసం ఐపీవో ఈ శుక్రవారం నాడు తెరవబడుతోంది. ఐపీవోలో లాట్ పరిమాణాన్ని 40 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. అంటే ఒక్క లాట్ కొనుగోలు చేసేందుకు ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్ కనీసం రూ.14,460 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. పైగా ఏకకాలంలో ఒక రిటైల్ ఇన్వెస్టర్ కేవలం 13 లాట్ల కోసం మాత్రమే బిడ్డింగ్ వేసేందుకు అనుమతి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

షేర్ల కేటాయింపు..

షేర్ల కేటాయింపు..

సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసిన తర్వాత ఇన్వెస్టర్లకు షేర్లు ఎలాట్ అవుతాయి. అంటే డిసెంబర్ 26న షేర్లు పొందిన ఇన్వెస్టర్ల డిమాట్ ఖాతాల్లోకి కంపెనీ షేర్లు జమ అవుతాయి. అయితే ఈ ఐపీవో డిసెంబర్ 29న స్టాక్ ఎక్స్ఛేజీల్లో లిస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ ఏడాది మార్కెట్లో లిస్ట్ అయ్యే చివరి ఐపీవోగా KFin Technologies నిలవనుంది. దీనికి ICICI సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, JP మోర్గాన్ ఇండియా, IIFL సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియా IPO లీడింగ్ మేనేజర్లుగా ఉన్నాయి.

కంపెనీ లాభాలు.. వ్యాపారం..

కంపెనీ లాభాలు.. వ్యాపారం..

డిసెంబర్ 31, 2021తో ముగిసిన క్యాలెండర్ సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.97.69 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో కంపెనీ ఆదాయం రూ.463.52 కోట్లుగా ఉంది. కెఫిన్ తన IPOలో 75 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోసం, 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్, కేవలం 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసింది. సాంకేతికత ఆధారంగా దేశంలోని మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, వెల్త్ మేనేజర్‌లు, పెన్షన్ అలాగే కార్పొరేట్ ఇష్యూయర్‌ల వంటి అసెట్ మేనేజర్‌లకు సేవలను అందించటంలో కంపెనీ అగ్రగామిగా కొనసాగుతోంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *