Kitchen Hacks : కార్న్‌ఫ్లోర్‌కి బదులుగా వీటిని వాడొచ్చు..

[ad_1]

గోధుమ పిండి..

ఇది మొక్కజొన్న పిండికి హెల్దీ ఆల్టర్నేటివ్. ఎందుకంటే, ఇందులో ప్రోటీన్, ఫైబర్‌లు ఉంటాయి. సూప్స్‌ని చిక్కగా చేసేందుకు సాయపడుతుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం కార్న్ ఫ్లోర్ కంటే గోధుమపిండిని రెండింతలు ఎక్కువగా వాడొచ్చు.

ఆరో రూట్..

ఇది మరాంటా జాతికి చెందిన మూలాలతో తయారు చేసిన మరో పిండి. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. మొక్కజొన్న పిండికి హెల్దీ ఆల్టర్నేటివ్. గ్లూటెన్ రహిత ప్రత్యామ్నాయం కూడా.

పొటాటో స్టార్చ్

పొటాటో స్టార్చ్..

బంగాళాదుంపల్ని చూర్ణం చేసి, వాటిని పొడిగా ఆరబెట్టడం ద్వారా ఈ గ్లూటెన్ రహిత ఆల్టర్నేటివ్ తయావరుతుంది. కార్న్‌ఫ్లోర్‌కి దీనిని 1:1 రేషియోలో కలపొచ్చు.

Also Read : Protein Breakfast : ఈ బ్రేక్‌ఫాస్ట్ హెల్త్‌కి చాలా మంచిది..

టపియోకా..

ఇది ఓ కూరగాయ అయినా కాసావా నుండి తీసి ప్రాసెస్ చేసిన పిండి పదార్థం, హెల్దీ ఆల్ట్నేటివ్. ప్రతి టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌కి బదులుగా 2 టేబుల్ స్పూన్ల టపియోకా పిండిని కలపొచ్చు.

ఫ్లాక్స్ పిండి..

కరిగే ఫైబర్‌కి గొప్ప మూలం ఈ పిండి. ఈ హెల్దీ ఆల్టర్నేటివ్ కోసం ఈ పిండిని వాడొచ్చు. మంచి ఫలితాల కోసం 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్‌ను 4 టేబుల్ స్పూన్ల నీటితో కలపాలని సూచించబడింది.

Also Read : Plant Based Protein : వీటిని తింటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుందట..

బియ్యం పిండి..

ఇది మొత్తగా బియ్యం పిండి తయారవుతుంది. గట్టిపడే ఏజెంట్‌గా వాడొచ్చు. మెరుగైన రిజల్ట్స్ కోసం బియ్యపిండిని రెట్టింపు మోతాదులో వాడండి.

గ్వార్ గమ్..

గ్వార్ బీన్స్ అని పిలిచే నుండి తయారవుతుంది. తక్కువ కేలరీలు, కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన హెల్దీ మారుతుంది. ఇది ఆరోగ్యకరమైన చిక్కగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2 కప్పుల సూప్ చేసేందుకు పావు టీ స్పూన్ సరిపోతుంది. ఇలా వీటిని వాడడం వల్ల రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Sleep Benefits : ఈ టైమ్‌లో నిద్రపోతే లివర్‌కి చాలా మంచిదట..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *