PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Lemon Juice: నిమ్మరసం రోజూ తాగితే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

[ad_1]

​Lemon Juice: పసుపు పచ్చని రంగులో నిగనిగలాడే నిమ్మ ప్రకృతి మనకు ప్రసాదించిన ఓ అద్భుతమైన వరం. ఈ పుల్లటి, గుండ్రని పండులో ప్రోటిన్‌, కొవ్వు, విటమిన్‌ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాల పవర్‌హౌస్‌. పోషకాలతో నిండి ఉన్న నిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి, గుండె జబ్బల ముప్పును తగ్గిస్తాయి, మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయి. శరీర కణజాలం పెరుగుదల, అభివృద్ధి, మరమ్మత్తుకు విటమిన్‌ సీ కీలక పాత్ర పోషిస్తుంది. వేసవిలో నిమ్మరసం.. బెస్ట్‌ రిఫ్రెష్‌ డ్రింక్‌ అని చెప్పొచ్చు. నిమ్మరసం రోజూ తీసుకుంటే.. మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.

గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది..

గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది..

నిమ్మరసంలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది గొంతును శుభ్రపరుస్తుంది, మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీరు గొంతు నొప్పితో బాధపడుతుంటే.. ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీళ్లలో అరస్పూన్‌ తేనె, స్పూన్‌ నిమ్మరసం కలిపి తాగితే మీకు త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Heart Attack Factors: గుండెపోటు రావడానికి.. 6 ప్రధాన కారణాలు ఇవే..!

కిడ్నీలో రాళ్లను దూరంగా ఉంచుతుంది..

కిడ్నీలో రాళ్లను దూరంగా ఉంచుతుంది..

నిమ్మరసం మూత్రంలో సిట్రేట్‌ స్థాయిలను పెంచి.. మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది. సిట్రేట్ కాల్షియంకు అతుక్కుంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.

(image source – pixabay)

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

నిమ్మరసం, నిమ్మ తొక్కలో పెక్టిన్‌ అనే కరిగే ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్‌లో జీర్ణ ఎంజైమ్‌ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మరసం తీసుకుంటే చాలా మంచిది. నిమ్మరసం మీ శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. (image source – pixabay)

బ్లడ్‌ షుగర్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది..

బ్లడ్‌ షుగర్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది..

నిమ్మరసంలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌‌ని అదుపులో ఉంచుతుంది.. తద్వారా చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. నిమ్మరసం తీసుకుంటే డయాబెటిస్‌ వచ్చే ముప్పు తగ్గుతుంది. షుగర్‌ పేషెంట్స్‌ రోజూ నిమ్మరసం తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.

Also Read:Diabetes control: ఈ మొక్క ఆకులతో.. షుగర్‌కు చెక్‌ పెట్టవచ్చు..!

బరువు తగ్గుతారు..

బరువు తగ్గుతారు..

నిమ్మకాయలో పెక్టిన్ ఉంటుంది. నిమ్మరసం మీకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. నిమ్మరసంలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది.. దీనిలో ఉండే లో డెన్సిటీ ఫైబర్‌ శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడానికి, బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

(image source – pixabay)

యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి..

యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి..

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది..

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది..

నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి మన శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. విటమిన్‌ సి వాపును తగ్గిస్తుంది, కొల్లాజెన్‌ ఉత్పత్తిని ప్రోత్సహించి.. గాయాలు వేగాంగా మానేలా తోడ్పడుతుంది. నిమ్మరసం యాంటీ ఆక్సిడెంట్ల అద్భుతమైన మూలం. ఇది ఫ్రీ రాడికల్స్‌ దెబ్బతినకుండా.. మీ కణాలను రక్షించి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

Also Read:Thyroid Diet: ఈ ఫుడ్స్‌ తింటే.. థైరాయిడ్‌ నార్మల్‌ అవుతుంది..!

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *