PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Mahindra EV: భారీ ఈవీ ప్లాంట్ ఏర్పాటులో మహీంద్రా.. ఎక్కడో తెలుసా..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Mahindra EV: రవాణా రంగంలో రానున్నది ఎలక్ట్రిక్ వాహనాల యుగం. ఈ క్రమంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మహీంద్రా గ్రూప్ రెడీ అయ్యింది. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ పూణేలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రమోషన్ పథకం కింద సైట్ ఆమోదం పొందింది. కంపెనీ తన అనుబంధ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అభివృద్ధి, ఉత్పత్తిపై దృష్టి సారిస్తోంది. రానున్న 7-8 సంవత్సరాల్లో ఇందుకోసం సుమారు రూ.10,000 కోట్లను వెచ్చించనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. ప్రస్తుతం భారత ఈవీ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోంది.

 Mahindra EV: భారీ ఈవీ ప్లాంట్ ఏర్పాటులో మహీంద్రా..

ఆటోమేకర్ తాజా ప్లాన్ దాని కొత్త ఎలక్ట్రిక్-ఓన్లీ BEV బ్రాండ్‌ను ప్రారంభించినందున, ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లోకి ప్రవేశించాలని కంపెనీ ప్లాన్ చేసింది. కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో యూకేలో తన BEVలను ప్రదర్శించింది. కంపెనీ ఎలక్ట్రిక్ SUVల కోసం XUV లేబుల్ కింద XUV400 మోడల్‌ను జనవరిలో మార్కెట్లోకి తీసుకొస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దాని ప్రణాళికలను వేగవంతం చేయడానికి ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి 250-500 మిలియన్ డాలర్లను సేకరించాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. 2030 నాటికి కార్ల మార్కెట్‌లో EVల వాటాను 30%కి పెంచాలని భారత ప్రభుత్వం లక్ష్యాలను నిర్ధిశించుకున్న తరుణంలో కంపెనీ సైతం అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో పడింది. 2040 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి చేరుకోవాలనే మహీంద్రా గ్రూప్ నిబద్ధతలో EVలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

English summary

Mahindra group to invest 10000 crores for EV plant in Pune

Mahindra group to invest 10000 crores for EV plant in Pune

Story first published: Wednesday, December 14, 2022, 15:08 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *