PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Morgan Stanley Layoffs: ముంచుకొస్తున్న మాంద్యం.. ఉద్యోగులు జాగ్రత్త..

[ad_1]

2 శాతం మంది

2 శాతం మంది

డిసెంబర్6, 2022 మంగళవారం కంపెనీ తన సిబ్బందిలో 2 శాతం మందిని అంటే దాదాపు 1600 మంది ఉద్యోగులను తొలగించింది. న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ తొలగింపు మోర్గాన్ స్టాన్లీ (మోర్గాన్ స్టాన్లీ లేఆఫ్స్) లో పనిచేస్తున్న మిగిలిన 82,000 మంది ఉద్యోగులను కూడా ప్రభావితం చేస్తుంది. చాలా ఆలోచించిన తర్వాత, మేము చాలా తక్కువ మంది ఉద్యోగులను తొలగించామని కంపెనీ వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పింది.

పెప్సికో

పెప్సికో

ప్రపంచంలోని అతిపెద్ద పానీయాల కంపెనీ పెప్సికో ఉద్యోగులను తొలగిస్తుంది. పెప్సికో పెప్సి కోలా డ్రింక్‌తో పాటు డోరిటోస్, లేస్ చిప్స్ , క్వేకర్ ఓట్స్‌ని తయారు చేస్తుంది. పెప్సీకోలో ప్రపంచవ్యాప్తంగా 309,000 మంది ఉద్యోగులున్నారట. వీరిలో 40శాతానికి మంచి అమెరికాలోనే ఉన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం ద్వారా ఇప్పటికే స్నాక్స్ యూనిట్లో ఉద్యోగాల కోత నేపథ్యంలో ఇక పానీయాల వ్యాపారంలో కోతలు భారీగా ఉంటాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది.

ఖర్చులు తగ్గించుకోవడం

ఖర్చులు తగ్గించుకోవడం

ఈ వార్తలపై పెప్సీకో కంపెనీ అధికారికంగా ఇంకా స్పందించలేదు. అయితే ఈ కథనం తర్వాత ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 0.1% పెరిగాయి. చక్కెర, మొక్కజొన్న, బంగాళాదుంపల వంటి వస్తువులకు ఎక్కువ చెల్లించి, ప్రొడక్టులను అధిక ధరలను వినియోగదారులకు అందజేస్తున్నప్పటికీ కంపెనీ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేపోతున్నట్లు తెలిసింది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఐటీలోనే కాకుండా మీడియా కంపెనీల్లో లక్షల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నారు.

చాలా కంపెనీలు ఉద్వాసన పలికాయి.

అమెజాన్

అమెజాన్

ఇ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ 10,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీనికి రెట్టింపు సంఖ్యలో పింక్ స్లిప్ ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్‌ దెబ్బతో రానున్న రోజుల్లో అమెజాన్‌ ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోన్నట్లు తెలుస్తోంది.ఆర్థిక మాంద్యం, ఆదాయల క్షీణత నేపథ్యంలో వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు సమాచారం. తొల‌గించే ఉద్యోగుల‌కు 24 గంట‌ల ముందు నోటీసు జారీచేయ‌డంతో ప‌రిహార ప్యాకేజ్‌ను సెటిల్ చేయనున్నారు. ఉద్యోగుల తొలగింపుతో అమెరికాలో మాంద్యం భయం నిరంతరం పెరుగుతోంది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *