[ad_1]
News
oi-Mamidi Ayyappa
Motor Insurance: మోటార్ ఇన్సూరెన్స్ చట్టాల్లో సరికొత్త మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం కార్ల యజమానులకు ప్రతి సంవత్సరం తమ కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఈ క్రమంలో కొన్నిసార్లు సమయానికి రెన్యువల్ చేసుకోవటం మరచిపోవటం, ఏడాది తర్వాత బీమా చేసుకోవటం మానేయటం చేస్తుంటారు. అయితే ఈ పరిస్థితిని మార్చేందుకు కొత్త ప్లాన్ ముందుకు వచ్చింది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ IRDAI వాహనాల ఇన్సూరెన్స్ కవరేజీ వ్యవధిని ఒక సంవత్సరం నుంచి పెంచే ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ స్కీమ్ అమోదం పొంది, అమలులోకి వస్తే కార్ల యజమానులు ఒకేసారి మూడేళ్ల కవరేజ్ పాలసీలను, ద్విచక్ర వాహనదారులు ఏకంగా 5 ఏళ్ల కవరేజ్ పాలసీలను దీర్ఘకాలం కోసం కొనుక్కోవచ్చు.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా థర్డ్-పార్టీ, సొంత-డ్యామేజ్ కవరేజీ రెండింటినీ కవర్ చేసే దీర్ఘకాలిక మోటారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ప్రవేశపెట్టే ప్రణాళికలను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రైవేట్ కార్లకు మూడేళ్ల ఇన్సూరెన్స్ ప్లాన్, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల ఇన్సూరెన్స్ ప్లాన్‌తో పాటు మోటార్ థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేయాలని డ్రాఫ్ట్ ను ప్రతిపాదించింది.
తాజా స్కీమ్స్ ప్రకారం పాలసీ కవరేజ్ మెుత్తం కాలానికి ప్రీమియం కొనుగోలు సమయంలో సేకరించబడుతుంది. అంటే వాహనదారులు ఈ స్కీమ్ కింద ప్రతిఏటా పాలసీ సొమ్మును చెల్లించనక్కర్లేదు. పాలసీ కొనుగోలు సమయంలోనే సదరు కాలానికి పూర్తిగా చెల్లించాల్సిన మెుత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వసూలు చేస్తాయి. దీనివల్ల ప్రతి ఏటా రెన్యూవల్ టెన్షన్ తగ్గటంతో పాటు పాలసీ చెల్లింపు మెుత్తం కూడా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
దీనికి సంబంధించి ప్రీమియం లెక్కింపు, క్లెయిమ్ చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలను, ఫార్ములాలను IRDAI తన ముసాయిదాలో ముందుగానే పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ స్కీమ్ పై డిసెంబర్ 22లోపు తమ అభిప్రాయాలను తెలియజేయాలని అన్ని పబ్లిక్ ఇన్సూరెన్స్‌లతో సహా వాటాదారులను IRDAI ఆదేశించింది. వారి సూచనలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ యోచిస్తోంది.
English summary
Insurance Regulator IRDAI Propsed Long term Insurance Policies To vehicles know details
Insurance Regulator IRDAI Propsed Long term Insurance Policies To vehicles know details
Story first published: Friday, December 9, 2022, 17:18 [IST]
[ad_2]
Source link