PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Mukesh Ambani: యువత మెచ్చిన వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ.. పక్కా గేమ్ ప్లాన్.. మీరు రెడీనా..

[ad_1]

TikTok..

TikTok..

చైనీస్ పాపులర్ యాప్ టిక్ టాక్ ను భారత ప్రభుత్వం బ్యాన్ చేయటంతో దానికి ప్రత్యామ్నాయంగా అనేక దేశీయ సంస్థలు అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ముందుకొచ్చాయి. అయితే టిక్‌టాక్ సృష్టించిన ప్రభావాన్ని ఎవరూ సృష్టించలేకపోయారనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అందుకే భారత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఈ రంగంలోకి అడుగుపెట్టాని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే దేశంలో షార్ట్ వీడియో సెగ్మెంట్‌లో కొత్త సేవను ప్రారంభించనున్నట్లు జియో ప్లాట్‌ఫారమ్‌లు కొన్ని నెలల క్రితం ప్రకటించింది.

వీడియో ప్లాట్‌ఫామ్..

వీడియో ప్లాట్‌ఫామ్..

జియో వీడియో క్రియేటర్ల కోసం Platfom పేరుతో సరికొత్త షార్ట్ వీడియో యాప్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇది మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లతో పాటు మరిన్ని కంపెనీలకు పోటీదారుగా నిలవనుంది. రియలన్స్ జియో ఆరంభం నుంచి ప్రస్థానాన్ని గమనిస్తే.. కంపెనీ మార్కెట్లోని ఇతర కంపెనీలను తన సేవల ద్వారా ఎలా కనుమరుగయ్యేలా చేసిందో మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఈ వ్యాపారంలో కూడా అదే ఫార్ములాలను వినియోగించి వాటిని వెనక్కి నెడుతుందా అనే విషయం వేచి చూడాల్సిందేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

సర్వం సిద్ధం..

సర్వం సిద్ధం..

Platfom పేరుతో అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో జనవరి 2023లో సేవలను ప్రారంభించనుంది. ఇది Tik Tok మాదిరిగా పనిచేయనుంది. దీనిని ప్రారంభించేందుకు కంపెనీ ఇప్పటికే ప్రముఖ గాయకులు, సంగీతకారులు, నటులు, హాస్యనటులు, డాన్సర్స్ తో పాటు ఫ్యాషన్ డిజైనర్లను దాని ప్లాట్‌ఫారమ్‌కు కనెక్ట్ చేసేందుకు అవసరమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. అలా ప్రజలు మెచ్చే కంటెంట్ కోసం తనవైపు నుంచి సాంకేతికత, నాణ్యతతో పాటు మెరుగైన కస్టమర్ అనుభవాన్ని పెంచేందుకు కంపెనీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. జియో ఇప్పటికే జియో మీట్, జియో మార్ట్, జియో సినియాలు అంటూ అనేక సేవలను తన ఫాట్ ఫారమ్ల ద్వారా అందిస్తూ దేశంలోని ప్రజలకు చాలా చేరువైంది. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా లభిస్తోంది.

కొత్తతరం పెట్టుబడులు..

కొత్తతరం పెట్టుబడులు..

క్రూడ్ ఆయిల్ రిఫైనరీ నుంచి డిజిటల్ సర్వీసెస్ కంపెనీగా మారడానికి చాలా అనుభవం అవసరం. దీని కోసం Jio 2018 నుంచి మల్టీ-టెక్, డిజిటల్ సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీగా పెట్టుబడులు పెడుతూ వస్తోంది. వీటిలో కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు Jio Savan, Embieb, Dunzo, Addverb, Haptik, netmeds వంటికి ఉన్నాయి.

అంబానీకి కలిసొచ్చే విషయం..

అంబానీకి కలిసొచ్చే విషయం..

రిలయన్స్ జియో సేవలు కొన్ని సందర్భాల్లో ఘోరంగా విఫలమైనప్పటికీ చాలా వరకు వృద్ధి బాటలోనే ఉన్నాయి. వీటన్నింటికీ మించి రిలయన్స్ ప్లాట్‌ఫారమ్‌లో కస్టమర్ బేస్ భారీగా ఉంది. అయితే కొత్త వైఫల్యాలను అధిగమించేందుకు కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే కంపెనీకి ఇప్పటి వరకు ఉన్న కస్టమర్ల సంఖ్య తన కొత్త SHOT వీడియో సర్వీస్ అయిన ప్లాట్‌ఫామ్ వేగంగా వృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది. అయితే ఇది యువతను ఆకర్షించేదిగా, మంచి రివార్డ్స్ అందించేదిగా ఉండాల్సి ఉంటుంది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *