Mulberries Health Benefits: మల్బరీ పండ్లతో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టేయండి..!

[ad_1]

జీర్ణక్రియకు మేలు చేస్తాయి..

జీర్ణక్రియకు మేలు చేస్తాయి..

మల్బరీ పండ్లోల జీర్ణక్రియకు మేలు చేసే డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఈ ప్రక్రియ మలబద్ధకం, ఉబ్బరం, కడుపు తిమ్మిరి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. మీరు జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే.. ఇవి కచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోండి.

(image source – pixabay)​

Health Care: పాలు ఎక్కువగా తాగితే.. ఇన్ని సమస్యలా..?

బరువు తగ్గుతారు..

బరువు తగ్గుతారు..

మల్బరీలు బరువు తగ్గడానికి సహాయపడతాయని ఓ అధ్యయనం పేర్కొంది. ఇటలీకి చెందిన ఎఫ్. డి రిటిస్ ఇన్‌స్టిట్యూట్ & కాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ నిర్వహించిన అధ్యయనంలో.. మల్బరీలను తమ రోజువారీ డైట్ ప్లాన్‌లో 1,300 కేలరీలు తీసుకునే వారు, దాదాపు మూడు నెలల వ్యవధిలో వారి మొత్తం శరీర బరువులో 10% తగ్గించుకుంటారని తెలిపింది. (image source – pixabay)

క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది..

క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది..

మల్బరీ పండ్లలో క్యాన్సర్‌ కణాలను నిర్మూలించే.. ఆంథోసైనిన్‌లు ఉంటాయి. వీటిలో రెస్వెరాట్రాల్‌‌ కూడా ఉంటాయి. వీటికి క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. తద్వారా పెద్దప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

(image source – pexels)

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..

మల్బరీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తనాళాలను విస్తరించి, వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూసుకుంటాయి. తద్వారా హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది. మల్బరీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

(image source – pixabay)

రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది..

రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది..

మల్బరీలు మాక్రోఫేజ్‌లలో ఉండే ఆల్కలాయిడ్‌లను వాటిని సక్రియం చేయడానికి ఉపయోగిస్తాయి, ఇది మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తంగా ఉంచుతాయి. మల్బరీలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
(image source – pixabay)
Sleep Quality: రాత్రిపూట ఈ డ్రింక్స్‌ తాగితే.. హాయిగా నిద్ర పోతారు..!

ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయి..

ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయి..

మల్బరీలో పుష్కలంగా ఉండే.. విటమిన్‌ కె, కాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు.. ఎముక కణజాలం, ఎముకలను నిర్మించడానికి తోడ్పడతాయి. ఈ పోషకాలు ఎముక క్షీణత, బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి.

(image source – pixabay)

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

బ్లడ్‌ షుగర్స్‌ తగ్గుతాయి..

బ్లడ్‌ షుగర్స్‌ తగ్గుతాయి..

షుగర్‌ పేషెంట్స్‌ వైట్‌ మల్బరీస్‌ తింటే.. మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వైట్ మల్బరీలో ఉండే కొన్ని సమ్మేళనాలు.. టైప్-2 డయాబెటిస్‌కు మెడిసిన్‌లా పనిచేస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *