News
oi-Mamidi Ayyappa
Notes
Ban:
దేశంలో
ఎన్నికలకు
సమయం
దగ్గర
పడుతున్న
తరుణంలో
మోదీ
సర్కార్
మరో
సంచలన
నిర్ణయం
తీసుకుంది.
శుక్రవారం
నాడు
రూ.2000
నోట్లను
చలామణి
నుంచి
ఉపసంహరించుకుంటున్నట్లు
రిజర్వు
బ్యాంక్
ఉత్తర్వులు
జారీ
చేసింది.
తాజా
సర్క్యూలర్
ప్రకారం
రూ.2000
నోట్లు
కలిగి
ఉన్న
వ్యక్తులు
సెప్టెంబరు
30
లోగా
వాటిని
మార్చుకోవాల్సి
ఉంటుంది.
రిజర్వు
బ్యాంక్
డేటా
ప్రకారం
మార్చి
31,2018
నాటికి
రూ.6.73
లక్షల
కోట్ల
విలువైన
రూ.2000
నోట్లు
చెలామణిలో
ఉన్నాయి.
ఇది
మొత్తం
విడుదలైన
నోట్లలో
37.3
శాతం.
అయితే
మార్చి
31,
2023
నాటికి
రూ.2000
నోట్ల
వాటా
10.8
శాతానికి
తగ్గింది.
పైగా
ఇవి
చలామణిలో
నిరంతరం
తగ్గుతూనే
ఉన్నాయి.

గతంలో
జరిగిన
డీమానిటైజేషన్
కంటే
ఇప్పుడు
నోట్ల
మార్పిడి
ప్రక్రియ
చాలా
సులభతరం
అయింది.
ఈ
క్రమంలో
నోట్ల
రద్దు
నిర్ణయం
దేశీయ
స్టాక్
మార్కెట్లపై
పెద్దగా
ఉండకపోవచ్చని
నిపుణులు
భావిస్తున్నారు.
రిజర్వు
బ్యాంక్
తీసుకున్న
చర్య
వ్యాపారాలపై
పెద్దగా
ప్రభావం
చూపకపోవచ్చని
వారు
చెబుతున్నారు.
పైగా
స్టాక్
మార్కెట్
లావాదేవీలు
ఎక్కువగా
ఆన్
లైన్
విధానంలో
నడుస్తాయి
కాబట్టి
ఇన్వెస్టర్లు
ఇబ్బందులను
ఎదుర్కోరని
వారు
అంటున్నారు.
ఇదే
క్రమంలో
సామాన్య
ప్రజలు
సైతం
నగదు
లావాదేవీలు,
చెల్లింపులకు
ఎక్కువగా
డిజిటల్
చెల్లింపు
మార్గాలను
వినియోగించటం
వల్ల
రూ.2000
నోట్ల
రద్దు
ప్రభావం
ఉండదని
ఆర్థిక
నిపుణులు
చెబుతున్నారు.
ప్రజలు
సాధారణంగా
ఆన్‌లైన్
చెల్లింపు
సౌకర్యాలను
పెద్ద
ఎత్తున
ఉపయోగిస్తున్నారు.
దీనివల్ల
2016లో
డీమోనిటైజేషన్
లాంటి
ప్రభావం
ఉండకూడదని
స్టాక్
మార్కెట్
ఇండిపెండెంట్
మార్కెట్
విశ్లేషకుడు
అంబరీష్
బలిగా
అభిప్రాయపడ్డారు.
ఆర్థిక
వ్యవస్థపై
తాజా
నిర్ణయం
ఎటువంటి
ప్రభావం
చూపదని
వెల్త్‌మిల్స్
సెక్యూరిటీస్
ఈక్విటీ
స్ట్రాటజిస్ట్
క్రాంతి
బథిని
పేర్కొన్నారు.
English summary
Know impact of 2000 rupees notes ban impact on indian stock markets, experts openion here
Know impact of 2000 rupees notes ban impact on indian stock markets, experts openion here
Story first published: Saturday, May 20, 2023, 10:10 [IST]