Osteoporosis : ఆస్టియోపోరోసిస్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలంటే..

[ad_1]

ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. మన జీవితంలో ఎముకలు కీ రోల్ పోషిస్తాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే, వయసు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనమవ్వడం, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. మరి ఎముకలు బలహీనమవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బోలు ఎముకల సమస్యని ఎలా తగ్గించుకునేందుకు ఏం చేయాలో ప్రిస్టిన్ కేర్ ఆర్థోపెడిక్స్ సీనియర్ కన్సల్టెంట్ చింతన్ హెగ్డే చెబుతున్నారు.

ఆస్టియోపోరోసిస్ ఎందుకొస్తుందంటే..

ఆస్టియోపోరోసిస్ ఎందుకొస్తుందంటే..

బోలు ఎముకల సమస్యలు..

బోలు ఎముకల సమస్య అనేది ఎక్కువగా వయసు పెరిగిన వారిలో వస్తుంది. ఎముకల సాంద్రత తగ్గడం, ఎముకల కణజాలం, ఆరోగ్యం క్షీణించడం వల్ల ఎముకల పగుళ్ళ ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితిని బోలు ఎముకల సమస్య అంటారు. బోలు ఎముకల సమస్య ఓ సైలెంట్ సమస్య. ఎముకలు విరిగేంత వరకూ ఎలాంటి లక్షణాలు ఉండవు.

Also Read : పచ్చి పసుపు, పసుపు పొడి.. రెండింటిలో ఏది మంచిదంటే..

ఎవరికొస్తుంది..

ఈ సమస్య ముఖ్యంగా ముసలివారిలో మెనోపాజ్‌లో ఉన్న మహిళలకి బోలు ఎముకల సమస్య వచ్చే అవకాశం ఉంది. మగవారిలో వయసు పెరిగే కొద్దీ సమస్య ఉంటుంది. రెగ్యులర్‌గా పగుళ్ళు, ముఖ్యంగా వెన్నెముక, తుంటి, మణికట్టు, ఇతర బరువు మోసే ఎముకల్లో, బలహీనమైన ఎముకలకి ప్రారంభ సంకేతాలు. ఈ పగుళ్ళు చిన్న గాయాలు, పడిపోవడానికి కారణాలు. ముసలివారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి.

ప్రధాన లక్షణాలు..

బోలు ఎముకల సమస్య ఉంటే అనేక లక్షణాలు ఉంటాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే.. ఎముకల పగుళ్ళు ఉంటే ఎత్తు తక్కువగా కనిపించేలా చేస్తుంది. చూస్తే కాస్తా శరీరం వంగినట్లుగా ఉంటుంది.

osteoporosis symptoms

వెన్నునొప్పి..

దీంతో పాటు వెన్నెముకలో కంప్రెషన్ ఫ్రాక్చర్లు వెన్నునొప్పికి కారణమవుతాయి. ఇది బోలు ఎముకల వ్యాధికి సంకేతం కావొచ్చు. సాధారణ ఎముక, కీళ్ళనొప్పి, స్పష్టమైన గాయం లేకుండా కూడా, ఎముకల బలహీనత ఉంటుంది. ఏదైనా పట్టుకున్నప్పుడు బలహీనంగా అనిపించడం, తక్కువ ఎముక సాంద్రత, అంటే బలహీనమైన ఎముకలు, దవడ ఎముకలు బలహీనంగా మారడం ఉంటుంది. చిగుళ్ళు, దంతాల ఆరోగ్య సమస్యలకి కారణమవుతాయి. ఇవే కాకుండా గోర్లు, ఎముకలు, దంతాల సమస్యలు, సులభంగానే విరిగిపోవడం జరుగుతుంటుంది.

Also Read : Bananas : వర్షాకాలంలో అరటిపండ్లు తింటే ఈ 6 సమస్యలు దూరం..

foods for osteoporosis

తగ్గేందుకు..

  • ఎముకల ఆరోగ్యాన్ని కాపాడే కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి.
  • ఆకుకూరలు, పాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • వర్కౌట్ కూడా చాలా ముఖ్యం.
  • వాకింగ్, జాగింగ్, డ్యాన్స్, స్ట్రెంథ్ ట్రైనింగ్ వర్కౌట్స్ ఎముకల ఆరోగ్యానికి మంచివి
  • మద్యపానం, ధూమపానం మానేయాలి.
  • అదే విధంగా సమస్య ఉంటే నడిచేటప్పుడు కింద పడకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా సపోర్ట్ తీసుకుంటే మరీ మంచిది.
  • 60 ఏళ్ళు పైబడిన మహిళలు, 70 ఏళ్ళు దాటిన మగవారు రెగ్యులర్‌గా బోన్ టెస్ట్ చేయించుకోవాలి.
  • వైద్యులు సూచించిన జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.

గమనించాల్సిన విషయాలు..

బోలు ఎముకల వ్యాధిని తగ్గించేందుకు ముందుగా దానిని గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్యని తగ్గించొచ్చు. అలానే ఎముకల బలాన్ని కాపాడే లైఫ్‌స్టైల్ పాటించాలి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడే సలహాలు వైద్యుల సూచనల మేరకు పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల సమస్యని చాలా వరకూ తగ్గించుకోవచ్చు.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Health News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *