PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Pakistan: శత్రుదేశంతో శభాష్ అనిపించిన ఇస్రో.. చంద్రయాన్ 3 సక్సెస్‌పై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు

[ad_1]

Pakistan: చంద్రయాన్ 3 విజయంతో ప్రపంచ దేశాల్లో భారత్‌కు ఉన్న ఘన కీర్తి.. మరో మైలు రాయిని అందుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టేందుకు అగ్రరాజ్యాలే విఫలమైన చోట ఇస్రో సాధించిన అఖండ విజయానికి అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని భారత్ పులకించిపోతోంది. తాజాగా పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ కూడా అంతరిక్ష రంగంలో ఇస్రో సాధించిన ఘన విజయంపై పొగడ్తలు కురిపించారు. అయితే చంద్రయాన్ 2 విఫలంపై ఈ ఫవాద్ చౌదరీ అప్పట్లో విమర్శలు చేసి.. నెటిజన్లతో బాగా ట్రోల్స్‌కు గురికావడం విశేషం.

అయితే తాజాగా ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమై.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగడంతో పాకిస్థాన్ ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ భారత్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రుడిపై చంద్రయాన్ 3 అడుగుపెట్టినందుకు ఇస్రోకు ఇది ఎంతటి గొప్ప క్షణం అని పేర్కొన్నారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌తో కలిసి అక్కడ ఉన్న యువ శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 విజయం జరుపుకోవడం వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్‌పై కలలుగన్న యువతరం మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదు అని ట్వీట్ చేశారు. అది కలిగి ఉండటం భారత్ అదృష్టమని వ్యాఖ్యానించారు.

అయితే ఈ ఫవాద్ చౌదరీ.. 2019 లో ఇస్రో పంపిన చంద్రయాన్ 2 విఫలం చెందడంతో నోటికొచ్చినట్లు మాట్లాడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థలపై భారత ప్రధాని మోదీ ప్రసంగం ఇస్తున్నారని.. ఆయన నాయకుడు కాదు ఓ వ్యోమగామి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒక పేద దేశమైన భారత్‌కు చెందిన రూ.900 కోట్లను వృథా చేసినందుకు లోక్‌సభ ఆయనను నిలదీయాలని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా మరిన్ని పరుషమైన పదాలు ఉపయోగించారు.

చంద్రయాన్ లాంటి పిచ్చి ప్రయోగాల కోసమో, అభినందన్ లాంటి వారిని భారత్‌ను దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి పంపించేందుకు డబ్బులు ఖర్చు పెట్టకుండా.. భారత్‌లో పేదరిక నిర్మూలన కోసం ఖర్చుపెట్టండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. కశ్మీర్‌లోనూ చంద్రయాన్ 2 లాంటి ఫలితమే వస్తుందని.. కాకపోతే అందుకు చాలా ఎక్కువ ఖర్చు ఉంటుందని ట్వీట్లు చేశారు. దీంతో ఫవాద్ చౌదరీపై భారతీయులు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ వాసులు కూడా విమర్శలు గుప్పించడం గమనార్హం. అలాంటి ఫవాద్ చౌదరీ.. ప్రస్తుతం చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో భారత్‌పై, ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. భారత్‌పై విమర్శలు చేసిన వారితోనే మళ్లీ ప్రశంసలు చేసేలా చేసినందుకు ఇస్రోకు హ్యాట్సాఫ్ చెప్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Modi On Chandrayaan 3: చంద్రయాన్‌ విజయంతో నా జీవితం ధన్యమైంది: ప్రధాని మోదీ
పరాజయం నుంచి విజయం వరకు.. చంద్రుడిపై అడుగుపెట్టడంలో ఇస్రో విజయం

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *