శరీరాన్ని క్లీన్‌ చేస్తుంది..

తాటి బెల్లం శరీర వ్యవస్థను శుభ్రపరుస్తుంది, శరీరంలోని అన్ని విషపదార్ధాలను బయటకు పంపుతుంది. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార పైపులు, ఊపిరితిత్తులు, కడుపుని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది.​

Black Gram Health Benefits: మినప పప్పు తింటే.. గుండెకే కాదు, షుగర్‌ పేషెంట్స్‌కు కూడా మేలు జరుగుతుంది..!

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మలబద్ధకానికి చెక్‌ పెడుతుంది..

మలబద్ధకానికి చెక్‌ పెడుతుంది..

తాటిబెల్లంలో డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. అజీర్ణం వంటి జీర్ణ రుగ్మతులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. బెల్లంలోని డైటర్‌ ఫైబర్‌ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. పేగు కదలికలను ప్రేరేపించి.. జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి తాటిబెల్లం ఔషధంలా పనిచేస్తుంది. తాటి బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం చేసిన తర్వాత చిన్న తాటిబెల్లం ముక్క తింటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.​

Food For Eyes: కళ్లను ఆరోగ్యంగా ఉంచే.. 10 ఆహారాలు ఇవే..!

నెలసరి నొప్పులు తగ్గుతాయ్..

నెలసరి నొప్పులు తగ్గుతాయ్..

తాటి బెల్లం నెలసరి సమస్యలను పరిష్కరించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నెలసరి నొప్పులతో బాధపడేవారు తాటి బెల్లం తీసుకుంటే.. ఉపశమనం లభిస్తుంది. తాటి బెల్లం తీసుకుంటే.. ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది, తిమ్మిరి, కడుపు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శ్లేష్మం తొలగుతుంది..

శ్లేష్మం తొలగుతుంది..

పొడిదగ్గు, జలుబు వంటివాటికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. గోరువెచ్చని కప్పు పాలల్లో చెంచా తాటిబెల్లం పొడి, పావుచెంచా మిరియాలపొడి కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. జలుబు వల్ల చేరిన శ్లేష్మాన్ని తొలగించి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆస్తమాకీ దూరంగా ఉండొచ్చు.​

Okra for diabetes: షుగర్‌ పేషెంట్స్‌ బెండకాయ తింటే మంచిదా..?

ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయ్..

ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయ్..

తాటి బెల్లంలో ఐరన్‌ ఇనుము, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచుతాయి. దీంతో రక్తహీనత ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఎక్కువ మోతాదులో ఉండే కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *