PNB Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. ఈనెల 12 వరకే డెడ్ లైన్..

[ad_1]

నాలుగు రోజులే గడువు..

నాలుగు రోజులే గడువు..

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) కస్టమర్లు మరో నాలుగు రోజుల్లో పూర్తి చేయాల్సిన విషయం ఒకటి ఉంది. బ్యాంక్ లో ఖాతా కలిగి ఇప్పటివరకు KYC అప్‌డేట్ చేయని PNB కస్టమర్‌లు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయని ఖాతాదారులు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఖాతాదారులు ఈ ప్రక్రియను సకాలంలో అప్‌డేట్ చేయాలని బ్యాంక్ విజ్ఞప్తి చేసింది.

కస్టమర్లకు నోటీసులు..

కస్టమర్లకు నోటీసులు..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారుల చిరునామాలకు దీనికి సంబంధించి ఇప్పటిరే రెండు సార్లు నోటీసులు పంపింది. కేవైసీ నవీకరణ వివరాలను వారి రిజిస్టర్డ్ మెుబైల్ నంబర్లకు ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారాన్ని అందించింది. ఇదే క్రమంలో బ్యాంక్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది. నవంబర్ 20,21 తారీఖుల్లో వార్తా పత్రికల్లో ప్రకటన కూడా చేసింది. అయితే ఎలాంటి కారణాల వల్లైనా మీరు కేవైసీ ప్రక్రియను పూర్తిచేయకుండే ఈ నెల 12లోపు దానిని కంప్లీట్ చేయాలని లేకుంటే సదరు అకౌంట్ల నుంచి లావాదేవీలు నిలిపివేయబడతాయని బ్యాంక్ స్పష్టం చేసింది.

KYC ఎందుకు అవసరమో తెలుసా..?

KYC ఎందుకు అవసరమో తెలుసా..?

KYC అంటే ‘నో యువర్ కస్టమర్’ అని అర్థం. దీని ద్వారా బ్యాంకులు తమ వివిధ శాఖల్లో అకౌంట్లు కలిగి ఉన్న కస్టమర్ల సమాచారాన్ని కాలానుగుణంగా అప్ డేట్ చేసుకుంటాయి. తద్వారా బ్యాంక్ దగ్గర ఉన్న వివరాలు సరిగా ఉన్నాయా లేక ఏవైనా మార్పులు ఉన్నాయా అనేది గమనించటం జరుగుతుంది. బ్యాంకింగ్‌లో కస్టమర్లు ప్రతి 6 నెలలు లేదా ఏడాదికి ఒకసారి KYC ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది. ఇందులో ఖాతాదారుని పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్, పూర్తి చిరునామాను అందించాలి. ఇలా చేయటం వల్ల బ్యాంక్ వద్ద తన కస్టమర్ల తాజా సమాచారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇది వారి ఖాతా భద్రతను పెంచేందుకు కూడా దోహదపడుతుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *