News
oi-Mamidi Ayyappa
Raghram Rajan: అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా రీసెర్చ్ సంస్థ సంచలన రిపోర్ట్ విడుదల చేసిన తర్వాత పరిస్థితులు పూర్తింగా మారిపోయాయి. ఆ విధ్వంసం నుంచి గ్రూప్ కంపెనీలు ఇప్పుడిప్పుతే తేరుకుంటున్నాయి. ఈ క్రమంలో వ్యవహారం దేశంలోని అత్యున్నత న్యాయస్థానం గపడకు చేరుకుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తుపై ప్రశ్నలు లేవనెత్తారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
పన్నులను తప్పించుకునేందుకు చాలా మంది మారిషల్, కేమన్ ఐలాండ్ వంటి చోట్ల డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేస్తుంటారని ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈడీ లాంటి సంస్థలు గుర్తించాయి. అయితే అదానీ గ్రూప్‌కు సంబంధించిన కేసులో మారిషస్‌కు చెందిన అనుమానాస్పద సంస్థల యాజమాన్యంపై ఇంకా విచారణ చేయకపోవటంపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశ్నించారు. నాలుగు మారిషస్ ఆధారిత ఫండ్స్ తమ మెుత్తం 6.9 బిలియన్ డాలర్ల మూలధనంలో 90 శాతం డబ్బును అదానీ గ్రూప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోందని.. ఈ విషయంలో ఎలాంటి విచారణ జరగనప్పుడు.. దీనికి కూడా దర్యాప్తు సంస్థల సహాయం సెబీకి అవసరమా అని ప్రశ్నించారు.

బూటకపు కంపెనీలకు డబ్బు మళ్లించి వాటిని తిరిగి దేశంలోకి తెచ్చారన్నది అమెరికా రీసెర్చ్ సంస్థ చేసిన అతిపెద్ద ఆరోపణల్లో ఒకటి. మారిషస్‌కు చెందిన ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, క్రెస్టా ఫండ్, అల్బులా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్.. షెల్ కంపెనీలని ఆరోపణలు రావడంతో గత రెండేళ్లుగా స్కానర్‌లో ఉంది. అదానీ గ్రూప్ తన షేర్ల ధరను పెంచేందుకు షెల్ కంపెనీలను ఉపయోగించుకుందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించడంతో గత ఏడాది జనవరిలో ఈ కంపెనీలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది.
English summary
Former RBI governor Raghuram Rajan Raises Questions over SEBI investigation in Adani Row
Former RBI governor Raghram Rajan Raised Questions over SEBI investigation in Adani Row
Story first published: Monday, March 6, 2023, 12:28 [IST]