Raghuram Rajan: రానున్నది కష్టకాలం..! భారత ఆర్థికంపై రఘురామ్ రాజన్ సంచలనం..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Raghuram Rajan: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మనందరికీ చాలాబాగా తెలిసిన వ్యక్తి. ప్రపంచం ఆర్థికంగా ఎదుర్కొనే సమస్యల గురించి ముందుగానే అనేక మార్లు హెచ్చరించిన భారతీయుడు రాజన్. అయితే ప్రస్తుత ఆర్థిక మందగమనం కొనసాగుతుండగా భారత్ కు ఎలాంటి ఇబ్బంది లేదని చాలా మంది నిపుణులు చెప్పినప్పటికీ.. రాజన్ అంచనాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి.

రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో బుధవారం నాడు ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే సవాళ్ల గురించి ముందుగానే ఆయన హెచ్చరించారు. రాజన్ అంచనాల ప్రకారం వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా కష్టాలు పెరుగుతాయని అన్నారు. అయితే దీనిని సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి అవసరమైన సంస్కరణలను రూపొందించటంలో దేశం విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు.

Raghuram Rajan: రానున్నది కష్టకాలం..! భారత ఆర్థికంపై రఘురామ్

కరోనా మహమ్మారి వల్ల అత్యధికంగా ఇబ్బందులను ఎదుర్కొన్న దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందించాలని రాజన్ కోరారు. దీనికి తోడు కుదేలైన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనిచ్చే అనుకూలమైన విధానాలను దేశంలోని ప్రభుత్వాలు రూపొందించాలని సూచించారు. అదే విధంగా సుస్థిర ఇంధన రంగంలో హరిత విప్లవానికి ఊతమివ్వాలని కూడా రాజన్ పిలుపునిచ్చారు.

దేశంలో తరువాతి విప్లవం సర్వీస్ సెక్టార్ లోనే ఉంటుందని రాజన్ రాహుల్ గాంధీతో సంభాషిస్తూ వెల్లడించారు. జోడో యాత్రలో పాల్గొన్న సమయంలో రాహుల్ ఆర్థిక వేత్త రఘురామ్ రాజన్ ను యూఎస్, ఇండియాతో పాటు అనేక దేశాల్లో ఉన్న సవాళ్లు, ఆర్థిక అసమానత వంటి కీలక అంశాలపై అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. ఇందులో ఆదాయానికి సంబంధించి కీలక అంశాలను మాట్లాడిన రాజన్.. కరోనా కాలంలో ఇంటి వద్ద నుంచి పనిచేసిన అప్పర్ మిడిల్ క్లాస్ వర్గాలు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాయని.. అందువల్లే వారి సంపాదన ఆ కాలంలో పెరిగిందని అన్నారు. ఫ్యాక్టరీల్లో ప్రత్యక్షంగా వెళ్లి పనిచేసే వారు మాత్రం తీవ్రంగా ఆదాయాన్ని కోల్పోయారని రాజన్ వెల్లడించారు.

Raghuram Rajan: రానున్నది కష్టకాలం..! భారత ఆర్థికంపై రఘురామ్

2023 ప్రపంచ దేశాలకు మాత్రమే కాక భారతదేశానికి కూడా చాలా ముఖ్యమని రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. దీనిపై ఆర్థిక నిపుణులు సైతం దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి మాంద్యం సూచనలు క్రమంగా నెమ్మదించటం.. వడ్డీ రేట్ల పెంపు కొనసాగటం సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక వృద్ధి ప్రజల కొనుగోలు తగ్గుతాయని వ్యాపార వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.

English summary

Former RBI governor warns Over Indian Economy in 2023 in Rahul Jodo yatra

Former RBI governor Raghuram Rajan warns Over Indian Economy in 2023 in Rahul Jodo yatra

Story first published: Friday, December 16, 2022, 9:52 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *