News
oi-Mamidi Ayyappa
Stock
Market:
గతవారం
స్టాక్
మార్కెట్లు
చివరి
రోజున
భారీ
నష్టాలతో
ముగించాయి.
అయితే
ఈ
క్రమంలో
వచ్చే
వారం
మార్కెట్లు
ఎలా
ఉండనున్నాయి..
ఏఏ
అంశాలు
మార్కెట్లను
ప్రధానంగా
ప్రభావితం
చేయనున్నాయనే
దానిపై
ఇన్వెస్టర్లు
ప్రస్తుతం
దృష్టి
సారిస్తున్నారు.
ఈ
క్రమంలో
రిటైల్
ఇన్వెస్టర్లు
గమనించాల్సిన
విషయాల
గురించి
ఇప్పుడు
తెలుసుకుందాం.
చాలా
కంపెనీలు
తమ
ఆర్థిక
ఫలితాలను
విడుదల
చేస్తున్న
క్రమంలో
వచ్చే
వారం
దాదాపు
300
కంపెనీలు
తమ
ఆర్థిక
ఫలితాలను
విడుదల
చేయనున్నాయి.
ఇది
మార్కెట్లపై
ప్రభావం
చూపుతుందని
నిపుణులు
భావిస్తున్నారు.
అయితే
ఇందులో
ఎక్కువ
లార్జ్
క్యాప్
కంపెనీలు
ఉండటంతో
చాలా
మంది
షేర్
హోల్డర్లు
ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు.

అలాగే
వచ్చే
వారం
భారత
ప్రభుత్వం
విడుదల
చేయనున్న
కన్స్యూమర్
ప్రైస్
ఇండెక్స్
ద్రవ్యోల్బణం
వివరాల
కోసం
మార్కెట్
వర్గాలు
ఆసక్తిగా
ఎదురుచూస్తున్నాయి.
ఇదే
క్రమంలో
అమెరికాలోని
బ్యూరో
ఆఫ్
లేబర్
స్టాటిస్టిక్స్
ఏప్రిల్
వినియోగదారుల
ధరల
సూచిక
ద్రవ్యోల్బణం
వివరాలను
విడుదల
చేయనుంది.
ఇది
మార్కెట్లకు
ఒక
దిక్సూచిగా
నిలిచే
అవకాశం
ఉన్నందున
ఇన్వెస్టర్లు
ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు.

బ్రోకరేజ్
జియోజిత్
అంచనాల
ప్రకారం
బలమైన
ఎఫ్‌ఐఐ
ఇన్‌ఫ్లో
సహాయంతో
దేశీయ
మార్కెట్
వారం
ప్రారంభంలో
సానుకూలంగా
కొనసాగింది.
ఇవి
ప్రతికూల
పరిస్థితుల
నుంచి
కాపాడుతుందని
అంచనా
వేస్తున్నారు.
అలాగే
ఫెడ్
రేట్ల
పెంపు,
US
బ్యాంకింగ్
సంక్షోభం
ఆర్థిక
వ్యవస్థను
నెమ్మదింపజేస్తుందని
అంచనాల
నేపథ్యంలో
ఇంధన
డిమాండ్‌పై
ప్రభావం
చూపుతుందనే
ఆందోళనల
తర్వాత
చమురు
ధరలు
మూడు
వారాలుగా
పడిపోయాయి.వీటికి
తోడు
అమెరికా
మార్కెట్లలో
బ్యాంకులు
కుప్పకూలటం,
అప్పుల
చెల్లింపుల్లో
కంపెనీలు
విఫలం
కావటం
వంటి
ప్రతికూల
అంశాలతో
మార్కెట్లలోని
ఇన్వెస్టర్లు
అప్రమత్తంగా
ఉండాల్సి
ఉంది.
English summary
Investors should look at these points to trade in markets next week, CPI inflation data key
Investors should look at these points to trade in markets next week, CPI inflation data key