Stock Market: మార్కెట్లకు అమెరికా పవనాలు.. లాభాల్లో కొనసాగుతున్న సూచీలు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Stock Market: అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గటంతో మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. వరుసగా ఐదో నెలలో ఈ గణాంకాలు తగ్గుముఖం పట్టాయి. నవంబరులో యూఎస్ రిటైల్ ద్రవ్యోల్బణం 7.1 శాతంగా నమోదు కావటం ప్రపంచ మార్కెట్లు లాభాల్లో కొనసాగేందుకు ఊతం ఇచ్చింది.

ఈరోజు లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆ పరంపరను కొనసాగిస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా, నిఫ్టీ సూచీ 60 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 123 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 157 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

 Stock Market: మార్కెట్లకు అమెరికా పవనాలు..

ఈ క్రమంలో మార్కెట్లో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కొ, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్, యూపీఎల్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టీసీఎస్, బజాజ్ ఆటో, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటోతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈ సూచీలోని నెస్లే ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, దివీస్ ల్యాబ్స్, బ్రిటానియా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.

English summary

Indian stock markets trading positive amid us retail inflation lowers

Indian stock markets trading positive amid us retail inflation lowers

Story first published: Wednesday, December 14, 2022, 11:20 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *