News
oi-Mamidi Ayyappa
Stock
Market:
వారం
చివరి
రోజు
దేశీయ
స్టాక్
మార్కెట్లు
తమ
ప్రయాణాన్ని
లాభాల్లో
ప్రారంభించాయి.
ప్రీ-ఓపెనింగ్
లో
ఫ్లాట్
ట్రేడింగ్
కొనసాగించాయి.
ఉదయం
9.16
గంటల
సమయంలో
బెంచ్
మార్క్
సూచీ
సెన్సెక్స్
120
పాయింట్లు,
మరో
కీలక
సూచీ
నిఫ్టీ
28
పాయింట్ల
లాభంలో
కొనసాగుతున్నాయి.
ఇదే
సమయంలో
నిఫ్టీ
బ్యాంక్
సూచీ
37
పాయింట్లు
నష్టపోగా,
నిఫ్టీ
మిడ్
క్యాప్
సూచీ
మాత్రం
39
పాయింట్ల
లాభంలో
కొనసాగుతున్నాయి.

ప్రధానంగా
అమెరికా
మార్కెట్లు
లాభాల్లో
ముగిసినప్పటికీ
ఆసియా
మార్కెట్లు
మాత్రం
మిశ్రమంగా
స్పందిస్తున్నాయి.
ఈ
క్రమంలో
వరుసగా
మూడో
వారం
సైతం
డాలర్
ధర
బలపడింది.
ప్రధానంగా
వడ్డీ
రేట్ల
పెంపు
భయాలు
దీనికి
కారణంగా
తెలుస్తోంది.
ఇదే
క్రమంలో
యూఎస్
డెట్
సీలింగ్
లిమిట్స్
గురించిన
ఆందోళనలు
అమెరికా
ఆర్థిక
వ్యవస్థలో
కొనసాగుతున్నాయి.
NSEలో
అదానీ
ఎంటర్
ప్రైజెస్,
టెక్
మహీంద్రా,
హెచ్సీఎల్
టెక్నాలజీస్,
బజాజ్
ఫిన్
సర్వ్,
ఎన్టీపీసీ,
ఇన్ఫోసిస్,
విప్రో,
యూపీఎల్,
బ్రిటానియా,
రిలయన్స్,
మారుతీ,
బజాజ్
ఫైనాన్స్,
హెచ్డీఎఫ్సీ
లైఫ్,
ఎస్బీఐ
లైఫ్,
అల్ట్రాటెక్
సిమెంట్స్,
బీపీసీఎల్,
ఓఎన్జీసీ,
టాటా
కన్జూమర్,
హీరో
మోటార్స్,
టాటా
స్టీల్
కంపెనీల
షేర్లు
లాభాల్లో
కొనసాగుతూ
టాప్
గెయినర్లుగా
నిలిచాయి.

ఇదే
క్రమంలో
పవర్
గ్రిడ్,
గ్రాసిమ్,
సన్
ఫార్మా,
యాక్సిస్
బ్యాంక్,
ఇండస్
ఇండ్
బ్యాంక్,
టైటాన్,
ఏషియన్
పెయింట్స్,
ఐసీఐసీఐ
బ్యాంక్,
ఐషర్
మోటార్స్,
సిప్లా,
నెస్లే,
హెచ్డీఎఫ్సీ,
దివీస్
ల్యాబ్స్,
బజాజ్
ఆటో,
ఎస్బీఐ,
ఐటీసీ,
జేఎస్డబ్ల్యూ
స్టీల్,
కోల్
ఇండియా
కంపెనీల
షేర్లు
నష్టాల్లో
కొనసాగుతూ
టాప్
లూజర్లుగా
ఉన్నాయి.
English summary
Indian stock markets trading slightly positive amid asian markets trading mixed
Indian stock markets trading slightly positive amid asian markets trading mixed
Story first published: Friday, May 26, 2023, 9:38 [IST]