PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Stretch Marks : గుడ్డు తెల్లసొనలో దీనిని కలిపి రాస్తే స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి..

[ad_1]

బంగాళాదుంప రసం..

బంగాళాదుంప రసం..

బంగాళాదుంప రసంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని అప్లై చేయడం వల్ల చర్మంపై నలుపు తగ్గుతుంది. ఈ రసం రాస్తే మహిళల్లో చేతులు, పొత్తికడుపు, తొడలపై వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి.

ఎలా వాడాలి
..

ముందుగా బంగాళాదుంప రసం తీసుకోవాలి. దీనిని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌‌గా స్ట్రెచ్ మార్క్స్, మచ్చలు త్వరగా తగ్గిపోతాయి.
Also Read : Ghee for Health : నెయ్యిలో వీటిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదట..

ఆలివ్ ఆయిల్..

ఆలివ్ ఆయిల్..

ఆలివ్ ఆయిల్ కూడా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా రాస్తే చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. స్ట్రెచ్ మార్క్ కూడా తగ్గిపోతుంది.

ఎలా వాడాలి..

ఆలివ్ ఆయిల్‌ని కాస్తా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి వదిలేయండి. అరగంట తర్వాత దీనిని నీటితో క్లీన్ చేయండి. సమస్య తగ్గిపోతుంది.

కొబ్బరి నూనె..

కొబ్బరి నూనె..

కొబ్బరి నూనె పొడి చర్మం, చర్మంపై మచ్చలు, మొటిమలు, సాగిన గుర్తులని తగ్గిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఎలా వాడాలి..

ముందుగా కొబ్బరినూనె తీసుకుని స్ట్రెచ్ మార్క్స్‌పై రాసి మసాజ్ చేయండి.. రోజు ఇలా చేయొచ్చు.
Also Read : ఈ నీటిని తాగితే కడుపులో గ్యాస్, మంట సమస్య ఫాస్ట్‌గా తగ్గుతుంది..

అలోవెరా జెల్..

అలోవెరా జెల్..

అలోవెరా జెల్ అనేది మంచి మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. ఇది చర్మాన్ని స్మూత్‌గా, మెరిసేలా, హైడ్రేటెడ్‌గా చేస్తుంది. ఇది చర్మంపై మచ్చలు, సాగిన గుర్తులని దూరం దూరం చేస్తుంది.

ఎలా వాడాలి..

అలోవెరా జెల్‌ని రెగ్యులర్‌గా స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి మసాజ్ చేయాలి. దీని వల్ల సమస్య తగ్గుతుంది.

కోడిగుడ్డు సొన..

కోడిగుడ్డు సొన..

గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అదనంగా, దాని జిగురు లాంటి పదార్థం చర్మానికి మెరుపుని అందిస్తుంది. ఈ గుడ్డులోని తెల్లసొన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడతలు, స్ట్రెచ్ మార్క్స్‌ని పోగొట్టడంలో సాయపడుతుంది.

ఎలా వాడాలి..

గుడ్డులోని తెల్లసొనని వేరు చేసి దానిని చెంచాతో బాగా బీట్ చేయండి. ఇందులో చెంచా గ్లిజరిన్ వేయాలి. పావు చెంచా మాత్రమే. దీనిని స్ట్రెచ్ మార్క్స్ రాసి ఆరిపోయాక నీటితో క్లీన్ చేయండి. రెగ్యులర్‌గా చేస్తే సమస్య తగ్గిపోతుంది.
​​గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​Read More : Home remedies News and Telugu News

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *