Success Story: 29 ఏళ్ల మహిళ బిజినెస్ సక్సెస్.. రికార్డులు సృష్టిస్తున్న నీలం సింగ్..!

[ad_1]

నీలమ్ సింగ్ ప్రయాణం..

నీలమ్ సింగ్ ప్రయాణం..

నీలం సింగ్ గుర్గావ్‌లో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి ఒక పాఠశాల ప్రిన్సిపల్. ఆమె దయాల్‌బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బి.కామ్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ICFAI (IBS)లో MBA పూర్తి చేశారు. ఎంబీఏ మార్కెటింగ్ పూర్తిచేసిన తర్వాత జెన్ పాక్ట్ సంస్థలో రూ.5 లక్షల జీతానికి పనిచేశారు. అలా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసిన తర్వాత 2016లో ఉద్యోగం మానేశారు. ఉద్యోగంలో తన వ్యాపారానికి అవసరమైన ధనాన్ని కూడబెట్టుకున్నారు.

ఆహార రంగంలోకి..

ఆహార రంగంలోకి..

ఎంబీఏ చదువుకుంటున్న రోజుల్లోనే నీలమ్ సింగ్ ఫాస్ట్ ఫుడ్ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కాలేజీలో జరగే మూడురోజుల ఫెస్ట్ సమయంలో చిన్న రెస్టారెంట్ నిర్వహించి ఏకంగా రూ.లక్ష సంపాదించింది. తన ఉద్యోగ సమయంలో దాచిన డబ్బుతో 2018లో గుర్గావ్‌లో ది బర్గర్ కంపెనీని ప్రారంభించింది. అలా గుర్గావ్ ఫోరమ్ మాల్ లో తన మెుదటి దుకాణాన్ని తెరిచింది.

రూ.40 కోట్ల ఆదాయం..

రూ.40 కోట్ల ఆదాయం..

ప్రయాణాన్ని చిన్నగా ప్రారంభించినప్పటికీ ఐదేళ్లలో ది బర్గర్ కంపెనీ ఆదాయం రూ.40 కోట్లకు చేరుకుంది. కరోనా సమయంలో చాలా మంది తమ సొంత వ్యాపారాలను ప్రారంభించాలని ఆలోచిస్తున్న సమయంలో అక్టోబర్ 2020లో ఫ్రాంచైజీ మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత సింగ్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన నితేష్ థాంకర్‌ను వివాహం చేసుకుంది. నితేష్ అమిటీ యూనివర్సిటీ నుంచి MBA గ్రాడ్యుయేట్, విజయవంతమైన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ కూడా.

100 అవుట్ లెట్లతో ముందుకు..

100 అవుట్ లెట్లతో ముందుకు..

ప్రస్తుతం కంపెనీ ఢిల్లీ NCR సహా ఏడు రాష్ట్రాలకు విస్తరించి 100 అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. కంపెనీ రూ.39 నుంచి రూ.239 వరకు ధరల శ్రేణిలో బర్గర్లను కస్టమర్లకు అందిస్తోంది. దీంతో అందరికీ అందుబాటు ధరల్లో రుచికరమైన ఆహారాన్ని అందించే వ్యాపారాన్ని ప్రారంభించాలన్న నీలం సింగ్ కల ఇప్పుడు నెరవేరిందని చెప్పుకోవాలి. చిన్న సంస్థగా ప్రారంభమై ప్రస్తుతం రూ.40 కోట్ల టర్నోవర్ అందుకునే స్థాయికి చేరుకోవటంతో సింగ్ తన వ్యాపార ప్రయాణాన్ని విజయవంతంగా నడుపుతున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *