PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Summer skin care: సమ్మర్‌ స్కిన్‌కేర్‌లో కచ్చితంగా ఉండాల్సిన 6 పదార్థాలు ఇవే..!


Summer skin care: ఎండలు మండిపోతున్నాయ్‌.. ఈ సీజన్‌లో మన చర్మం ఎక్కువగా ఎఫెక్ట్‌ అవుతుంది. ఎండ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మంపై చెమట పొక్కులు, మొహం నల్లగా మారడం, ఎర్ర మచ్చలు, జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి అధిక సంరక్షణ అవసరం. ఈ సీజన్‌లో మన బ్యూటీ కేర్‌ రొటీన్‌లో కొన్ని పదార్థాలు చేర్చుకుంటే.. ఈ సమస్యలకుసులభంగా చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

చందనం..

చందనం మన సౌందర్య సంరక్షణలో ఎంతగానో సహాయపడుతుంది. గంధంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీమైక్రోబయల్, యాంటీప్రొలిఫెరేటివ్, గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. చర్మంపై ముడతలు, గీతలు పడకుండా నివారిస్తుంది. చందనం టోన్‌ని మెరుగుపరుస్తుంది. గంధం చర్మంలో పేరుకున్న మలినాలు తొలగిస్తుంది, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది. సన్ టాన్, పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది. తామర, సోరియాసిస్‌, సన్‌ స్ట్రోక్‌ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

(image source- pixabay)

ఈ ప్యాక్‌తో.. ట్యాన్‌ ఈజీగా మాయం అవుతుంది..!

ఈ ప్యాక్‌తో.. ట్యాన్‌ ఈజీగా మాయం అవుతుంది..!

కీరా..

కీరా..

వేసవిలో మీ చర్మాన్ని తేమగా, హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఉత్తమమైన మార్గం కీరా. కీరాను మీ ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత.. చర్మంపై టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మీరు ఇంట్లోనే కీరా ఫేషియల్ మిస్ట్‌ని తయారు చేసుకుని వాడొచ్చు. కళ్లు ఉబ్బు, డార్క్‌ సర్కిల్స్‌ ఉంటే.. వారానికి రెండుసార్లు కీరా ముక్కలను కంటి మీద 15 నిమిషాల పాటు ఉంచుకోండి. (image source- pixabay)

పెరుగు..

పెరుగు..

పేగులకు మంచి ఆహారాలలో పెరుగు ఒకటి. పెరుగులో ఉండే కాల్షియం, ప్రోటీన్‌, విటమిన్ బి 6, విటమిన్ బి 12,ఏ, డి వంటి పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌ తొలగిస్తుంది. ముడతలు, వృద్ధాప్య ఛాయలను మాయం చేస్తుంది. లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. వడదెబ్బ నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. వేసవిలో మీ స్కిన్‌కేర్‌ రొటీన్‌లో పెరుగును తప్పకుండా చేర్చుకోండి. (image source- pixabay)

Tip to get rid of oily skin: ఈ టిప్స్‌ ఫాలో అయితే.. జిడ్డు సమస్య దూరం అవుతుంది..!

సిట్రస్‌ పండ్లు..

సిట్రస్‌ పండ్లు..

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలసిపోయిన, నిస్తేజంగా ఉన్న ముఖాన్ని ప్రకాశవంతం చేయడానికి, సూర్యరశ్మి నుంచి రక్షించడానికి విటమిన్‌ సి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కొల్లాజెన్, ఎలాస్టిన్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా హైపర్‌పిగ్మెంటేషన్, నలుపును తగ్గించడానికి మెలనిన్‌ను నిరోధిస్తుంది. సిట్రస్‌ పండ్లు మీ చర్మానికి అప్లై చేసేప్పుడు.. వేరే వాటితో మిక్స్‌ చేసి రాయండి. (image source- pixabay)

కలబంద..

కలబంద..

కలబందను “మిరాకిల్ హెర్బ్” అని కూడా పిలుస్తారు. ఇది మీ చర్మాన్ని హైడ్రెటింగ్‌గా, కాంతివంతంగా ఉంచుతుంది. మీ చర్మానికి తేమనందిస్తుంది. కలబంద చర్మంపై ట్యాన్‌ను తొలగించి.. ప్రకాశవంతంగా ఉంచుతుంది. (image source- pixabay)

కొబ్బరి నూనె..

కొబ్బరి నూనె..

వేసవి చర్మ సంరక్షణ కోసం కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ఫ్యాటీ యాసిడ్స్‌ ఇన్ఫ్లమేషన్‌ తగ్గిస్తాయి, మొటిమలను నివారిస్తాయి. ఇది మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా, క్లెన్సర్‌గా, సన్‌స్క్రీన్‌గా కూడా పనిచేస్తుంది. (image source- pixabay)

Elbow Darkness Removal: మోచేతులు నల్లగా మారాయా..? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..!

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *