[ad_1]
T+1 settlement: ఇండియన్ స్టాక్స్ మార్కెట్లు T+2 సెటిల్‌మెంట్ నుంచి T+1 సెటిల్‌మెంట్‌కు సంపూర్ణంగా మారిపోయే టైమ్ దగ్గర పడింది. ఇప్పటికే, విడతల వారీగా సింహభాగం స్టాక్స్ T+1 విధానానికి మారాయి. మిగిలినవి ఇప్పటికీ T+2 పద్ధతిలోనే సెటిల్ అవుతున్నాయి. వీటిని చివరి బ్యాచ్‌గా చెప్పుకోవచ్చు. ఈ చివరి బ్యాచ్ స్టాక్స్ కూడా ఈ శుక్రవారం (27 జనవరి 2023) నుంచి T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌లోకి కన్వర్ట్ అవుతాయి.
అంటే.. ఈ వారం + జనవరి నెల కాంట్రాక్ట్‌ల ఎక్స్‌పైరీ అయిన బుధవారమే (జనవరి 26, గురువారం నాడు గణతంత్ర దినోత్సవం కారణంగా మార్కెట్లకు సెలవు) T+2 సెటిల్‌మెంట్‌కు చివరి రోజు. ఈ ప్రాసెస్ మొత్తం స్మూత్‌గా జరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇండెక్స్ స్టాక్స్‌లో హై వాల్యూమ్ ట్రేడ్స్ కారణంగా ప్రభావం ఉంటుందని చెపుతున్నారు.
T+1 సెటిల్‌మెంట్ అంటే ఏంటి?
ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో, లిస్టెడ్ షేర్ల ట్రేడ్ సెటిల్‌మెంట్ ‘T+2’ (ట్రేడింగ్ + 2 డేస్) ప్రాతిపదికన జరిగేది. అంటే ఒక పెట్టుబడిదారు కొనుగోలు చేసిన లేదా విక్రయించిన స్టాక్స్ 2 రోజుల వ్యవధి తర్వాత అతని/ఆమె డీమ్యాట్ ఖాతాలో కనిపిస్తాయి లేదా తగ్గుతాయి. ఈ పద్ధతి వల్ల నష్టపోతున్నామంటూ మార్కెట్ వర్గాలు చేసిన అభ్యర్థనల మేరకు, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ సెబీ దీనిని ‘T+1’కి (ట్రేడింగ్ + 1 డే) కుదించాలని నిర్ణయించింది. ఫలితంగా.. ఒక పెట్టుబడిదారు కొనుగోలు చేసిన లేదా విక్రయించిన స్టాక్స్ ఒక్క రోజు వ్యవధిలోనే అతని/ఆమె డీమ్యాట్ ఖాతాలో కనిపిస్తాయి లేదా తగ్గుతాయి.
సెటిల్‌మెంట్ రోజుల సంఖ్యను తగ్గించడం వల్ల పెట్టుబడిదార్ల లిక్విడిటీ పెరుగుతుంది. షేర్లు వెంటనే డీమ్యాట్ ఖాతాల్లో కనిపిస్తున్నాయి. తద్వారా, మరో ట్రేడ్ తీసుకోవడానికి, మార్కెట్‌లో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి పెట్టుబడిదార్లకు వీలవుతుంది.
T+2 సెటిల్‌మెంట్ నుంచి T+1 సెటిల్‌మెంట్‌కు మారే ప్రక్రియ అంత సులభమేమీ కాదు. కాబట్టి, ఈ పనిలో ఇబ్బందులు రాకుండా దశల వారీగా కొత్త సెటిల్‌మెంట్ సైకిల్‌ను స్టాక్ ఎక్సేంజ్‌లు అమలు చేశాయి. ఎందుకంటే, T+2 సెటిల్‌మెంట్ నుంచి T+1 సెటిల్‌మెంట్‌కు మారేందుకు స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు కూడా తమ టెక్నాలజీని మార్చుకోవాలి.
షార్టర్ ట్రేడ్ సెటిల్‌మెంట్ సైకిల్‌కు మారడం దలాల్ స్ట్రీట్ చరిత్రలో ఒక కీలక మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్టాక్స్‌లో ‘T+1’ సెటిల్‌మెంట్ సైకిల్‌ను అమలు చేసిన మొదటి అతి పెద్ద మార్కెట్ చైనా. శుక్రవారంతో, భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ అవుతుంది. అభివృద్ధి చెందిన మార్కెట్లయిన అమెరికా, యూరోప్ దేశాలు ఇప్పటికీ ‘T+2’ సెటిల్‌మెంట్ సైకిల్‌లోనే ఉన్నాయి.
T+1 సెటిల్‌మెంట్‌తో ఇబ్బందులు ఎదురవుతాయా?
పెట్టుబడిదార్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో సహాయపడే మంచి మోడల్‌గా ‘T+1’ సెటిల్‌మెంట్‌ను కొందరు నిపుణులు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం దీర్ఘకాలిక ప్రభావం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తం లావాదేవీలు (బ్లాక్ డీల్స్) జరిగినప్పుడు ఈ మోడల్ ఎలా ప్లే అవుతుందో అర్ధం కావడం లేదని అంటున్నారు. దీంతోపాటు, బ్యాంక్‌ల డౌన్ టైమ్స్, మార్కెట్ అస్థిరత ఒకేసారి కనిపించినప్పుడు ‘T+1’ సెటిల్‌మెంట్‌తో రిస్క్ ఎదురవుతుందని చెబుతున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply