PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Tax Save: సమయం లేదు మిత్రమా.. పన్ను ఆదాకు ఇదే చివరి అవకాశం..!

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

ట్యాక్స్ ఫైల్ చేసే వారికి ఇక సమయం లేదు. పన్ను ఆదా చేసుకోవాలంటే వెంటనే కొన్ని పనులు చేయాల్సిందే. 80 సీ, 80 డీ కింద పన్ను ఆదా చేసుకోవడానికి పలు పథకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే జీవిత బీమా, ఆరోగ్య బీమా తీసుకోవచ్చు. పన్ను ఆదా చేసుకునే మార్గాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వేతన జీవులకు సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా పొందవచ్చు. 80CCD(1b) లో అదనంగా రూ.50,000 మినహాయింపు పొందొచ్చు. జీవిత బీమా పాలసీలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, గరిష్ఠంగా ఇద్దరు పిల్లలను చదివించడానికి ట్యూషన్ ఫీజు, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనడం లేదా నిర్మాణం, కనీసం 5 సంవత్సరాల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లు, నాబార్డ్ బాండ్ల కొనుగోలు లాంటివాటిలో పెట్టుబడి పెట్టి సెక్షన్ 80సీ ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు.

Tax Save: సమయం లేదు మిత్రమా.. పన్ను ఆదాకు ఇదే చివరి అవకాశం..

ఆరోగ్య బీమా చేసుకుని సెక్షన్ 80 డీ ద్వారా కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆరోగ్య బీమాను వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరు మీదు తీసుకున్నా పన్ను మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా చేయించినా పన్ను మనహాయింపు పొందవచ్చు. తల్లిదండ్రుల వయస్సు 60 ఏళ్ల కంటే తక్కువ ఉంటే రూ.25 వేలు. 60 ఏళ్ల కంటే ఎక్కువుంటే రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేసుకోవచ్చు.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD కింద మినహాయింపు పొందవచ్చు. గృహ రుణంపై వడ్డీ కూడా రూ.50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మంచి ఆప్షన్‌ గా ఉంది. ఒక వ్యక్తి ఐదేళ్ల కాల వ్యవధిలో రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు.

English summary

tax savings ways by using section 80C, section 80D

No more time for tax filers. To save tax there are some things to do immediately.

Story first published: Saturday, March 25, 2023, 12:55 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *