News
oi-Mamidi Ayyappa
TCS
News:
ప్రభుత్వ
యాజమాన్యంలోని
అతిపెద్ద
టెలికాం
సంస్థ
బీఎస్ఎన్ఎల్
నుంచి
టాటా
కన్సల్టెన్సీ
సర్వీసెస్
నేతృత్వంలోని
కన్సార్టియం
భారీ
ఆర్డర్
చేజిక్కించుకుంది.
మే
22,
2023న
దాదాపు
రూ.15,000
కోట్ల
విలువైన
అడ్వాన్స్
పర్చేజ్
ఆర్డర్‌ను
అందుకున్నట్లు
ప్రకటించింది.
అమెరికా,
యూకే
మార్కెట్లు
మందగించిన
సమయంలో
దేశీయ
అతిపెద్ద
సాఫ్ట్‌వేర్
ఎగుమతిదారు
అతిపెద్ద
డీల్
కుదుర్చుకున్నారు.
దేశవ్యాప్తంగా
4జీ
నెట్‌వర్క్
విస్తరణ
అమలు
ప్రణాళికలో
ఉన్నట్లు
స్టాక్
మార్కెట్
ఫైలింగ్స్
లో
వెల్లడించింది.
కన్సార్టియంలో
టాటా
గ్రూప్
టెలికాం
గేర్
మేకింగ్
కంపెనీ
తేజస్
నెట్‌వర్క్స్
ఉంది.
ఇది
రేడియో
యాక్సెస్
నెట్‌వర్క్స్
పరికరాలను
సరఫరా
చేయడానికి,
సర్వీసింగ్
చేయడానికి
బాధ్యత
వహిస్తుంది.

TCSతో
పాటు
ప్రాజెక్ట్
కోసం
రాష్ట్ర-రక్షణ
ITI
లిమిటెడ్‌కి
కూడా
APO
జారీ
చేయబడింది.
ఈ
ఒప్పందం
TCSకి
ఆదాయాన్ని
పెంచుతున్నప్పటికీ..
ఇతరులతో
జతకట్టడం
కారణంగా
మార్జిన్
తగ్గుతుందని
తెలుస్తోంది.
బీఎస్ఎన్ఎల్
పునరుద్ధరణ
చర్యల్లో
భాగంగా
జరిగిన
మూడో
అతిపెద్ద
ఒప్పందం
ఇదని
తెలుస్తోంది.
దీనికి
ముందు
అమెరికా,
బ్రిటన్
కంపెనీలతో
ఒప్పందాలు
జరిగాయి.
జూలై
2022లో
కేంద్ర
మంత్రి
వర్గం
బీఎస్ఎన్ఎల్
పునరుద్ధణకు
రూ.1.64
లక్షల
కోట్ల
భారీ
ప్యాకేజీని
ప్రకటించింది.
ఇందులో
రూ.43,964
కోట్ల
నగదు
మద్దతు,
రూ.1.20
లక్షల
కోట్ల
నగదు
రహిత
సహకారం
ఉన్నాయి.
పునరుద్ధరణ
ప్యాకేజీలో
BSNL
సేవల
నాణ్యతను
మెరుగుపరచడం,
బ్యాలెన్స్
షీట్‌ను
తగ్గించడం,
భారత్
బ్రాడ్‌బ్యాండ్
నెట్‌వర్క్
లిమిటెడ్
(BBNL)తో
విలీనం
ద్వారా
ఫైబర్
రీచ్‌ను
విస్తరించడం
అనే
మూడు
ప్రధాన
అంశాలు
ఉన్నాయి.
English summary
IT company TCS bagged 15000 crores worth order from gov telecom BSNL, Know details
IT company TCS bagged 15000 crores worth order from gov telecom BSNL, Know details
Story first published: Monday, May 22, 2023, 12:00 [IST]