Thyroid Symptoms : పాదాలు పగులుతుంటే థైరాయిడ్ ఉన్నట్లేనా..

[ad_1]

థైరాయిడ్ గ్రంధి హార్మోన్ల విడుదల చేస్తుంది. నియంత్రిస్తుంది. గుండె కొట్టుకోవడం నుండి నాడీ వ్యవస్థ పనితీరు వరకు ప్రతిదానికీ సంబంధం ఉంటుంది. మీ పాదాలు పొడిగా మారి పగులుతుంటే దీనిని అనుమానించాల్సిందే. థైరాయిడ్ ఉండడం వల్ల చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. హైపో థైరాయిడిజం, థైరాయిడ్ తక్కువగా ఉండే చాలా మందికి తమ పాదాల అరికాళ్ళపై ముఖ్యంగా మడమల మీద డ్రై స్కిన్ ఉంటుంది. మీరు లోతైన బాధాకరమైన పగుళ్ళతో బాధపడితే అది థైరాయిడ్ అని అనుమానించాల్సిందే..

థైరాయిడ్ అంటే..

థైరాయిడ్ అంటే..

థైరాయిడ్ గ్రంథి.. ఓ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది శరీరం జీవక్రియను నియంత్రించడంలో కీ రోల్ పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయనప్పుడు, అది బరువు, శక్తి స్థాయిలు, మానసిక స్థితిలో మార్పులు, అనేక లక్షణాలను సూచిస్తుంది. అందులో కొన్నింటిని మనం ఎక్కువగా పట్టించుకోం. అందులో ఒకటే పాదాల సమస్యలు. అయినప్పటికీ, దీనికి ట్రీట్‌మెంట్ చేయకుండా వదిలేస్తే.. రోజులు మారే కొద్దీ అనేక సమస్యలకి కారణమవుతుంది. ఈ రోజు పాదాలు థైరాయిడ్ గురించి కొన్ని విషయాలు చెబుతాయి.

పాదాల నొప్పి..

పాదాల నొప్పి..

థైరాయిడ్ ఉంటే సాధారణంగా పాదాల నొప్పి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియను నియంత్రించే హార్మోన్లని ఉత్పత్తి చేస్తుంది. సరిగ్గా పనిచేయనప్పుడు ఇది పాదాల్లో కండరాలు, కీళ్ళ నొప్పులను కలిగిస్తుంది. ఈ నొప్పి హైపోథైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజంతో సహా అనేక పరిస్థితుల వల్ల వస్తుంది. మీకు పాదాల నొప్పి ఉంటే ఓ సారి డాక్టర్‌ని కలవాలి.
Also Read : Menstrual Migraine : పీరియడ్స్ టైమ్‌లో తలనొప్పిగా ఉందా.. కారణాలివే..

పాదాలపై స్కిన్ డ్రైగా..

పాదాలపై స్కిన్ డ్రైగా..

హైపోథైరాయిడిజం ఉన్నవారిలో ఎక్కువగా వారి పాదాలపై స్కిన్ డ్రైగా, గట్టిగా ఉంటుంది. శరీర జీవక్రియను నియంత్రించడంలో థైరాయిడ్ గ్రంధి కీ రోల్ పోషిస్తుంది. అది సరిగ్గా పనిచేయనప్పుడు, డ్రై స్కిన్‌ సహా అనేక రకాల లక్షణాల సూచిస్తుంది. థైరాయిడ్ తక్కువగా ఉన్నప్పుడు, చర్మాన్ని తేమగా ఉంచేందుకు అవసరమైన నూనెలు, చెమట తగ్గుతుంది. చర్మం పొడిగా, గరుకుగా, దురదగా మారుతుంది. ఇది పాదాలపై ఎక్కువగా ఉంటుంది. పొడిబారడం పగుళ్ళు ఉంటాయి.

దురద కూడా..

దురద కూడా..

దురద అనేది హైపో థైరాయిడిజం సాధారణ లక్షణం. ఇది పాదాలకు మాత్రమే కాకుండా, చర్మం, కాళ్ళు, జననేంద్రియాలతో సహా శరీరంలోని ఇతర భాగాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. థైరాయిడ్ గ్రంధి తక్కువగా ఉండడం, నూనెలు, చెమట ఉత్పత్తి తగ్గడం వల్ల డ్రైస్కిన్ ఉంటుంది. చర్మం పొడిగా మారి దురదగా ఉంటుంది.

రక్త ప్రసరణ తగ్గడం..

రక్త ప్రసరణ తగ్గడం..

నిపుణుల ప్రకారం థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయనప్పుడు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా చర్మానికి రక్త సరఫరా తగ్గుతుంది. దానిలో నాలిగింట ఓ వంతు ఐదవ వంతు వరకు ఉంటుంది. సాధారణ మొత్తం పాదాలతో సహా లోయర్ బాడీ పార్ట్స్‌లో ముఖ్యంగా చలికాలంలో రక్తప్రసరణ సరిగా ఉండదు.

ఈ కారణాలు కూడా..

ఈ కారణాలు కూడా..

కిడ్నీలు పనిచేయకపోవడం, మధుమేహం, చర్మవ్యాధులు, గుండె జబ్బులు వంటి వివిధ సమస్యల వల్ల పాదాలు, కాళ్ళలో వాపు, నొప్పి రావొచ్చు. అయితే, హైపోథైరాయిడిజం కూడా ఓ కారణమే..

ఇతర లక్షణాలు..

ఇతర లక్షణాలు..

ఇతర లక్షణాలు చూస్తే.. పాదాల తిమ్మిరి, ఫుట్ ఇన్ఫెక్షన్, పాదాల నుంచి దుర్వాసన రావడం, అరికాళ్లు, గోళ్ళపై మార్పులు ఉంటాయి. పై లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవడం మంచిది.

సరైన షూ..

సరైన షూ..

థైరాయిడ్ సమస్య ఉన్నవారికి సరైన చెప్పులు, బూట్లు అవసరం. సరిగ్గా సరిపోయే, సౌకర్యవంతమైన షూ వేసుకోవడం వల్ల పాదాల నొప్పి, వాపు, తిమ్మిరి వల్ల నొప్పి, అసౌకర్యం ఉండదు.

పాదాలపై ఒత్తిడిని తగ్గించడంలో సాయపడే మృదువైన ఫుట్‌బెడ్‌తో సపోర్ట్, కుషనింగ్‌ని అందించే చెప్పులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వెడల్పాటి షూప్ ధరించడం, ఓపెన్ స్లిప్పర్స్ కూడా పాదాలపై, తిమ్మిరి తగ్గిస్తుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి మంచి పాదాల పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం. ఎందుకంటే ఇది చర్మ వ్యాధులు, అరికాలి మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ని నివారించేందుకు సాయపడుతుంది. పాదాలను రెగ్యులర్‌గా క్లీన్ చేయడం, ఆరేలా చూసుకోవడం, తేలికపాటి సబ్బు వాడడం, తేమకు ఎక్కువ కాలం బహిర్గతం కాకుండా ఉండేలా చూసుకోవడం మంచిది. మీ గోర్లు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్రీగా ఉండే షూ వేసుకోవాలి. చర్మం, గోర్లు, ఎరుపు, పగుళ్ళు, స్కేలింగ్ వంటి పాదాల రూపాల్లో ఏవైనా మార్పులను గమనించడం, మీరు ఏవైనా లక్షణాలను గమనిస్తే వైద్య సలహా తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

వీటిని తినొద్దు..

వీటిని తినొద్దు..

బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, కాలే వంటి కూరగాయలను తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కూరగాయలు జీర్ణ చేయడానికి థైరాయిడ్ అయోడిన్‌ని ఉపయోగించకుండా నిరోధించొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *