PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Tips to Relive Stomach Issues: కడుపులో గడబిడగా ఉందా.. ఈ టిప్స్ ఫాలో అయితే వెంటనే ఉపశమనం లభిస్తుంది..!

[ad_1]

Tips to Relive Stomach Issues: మనకు గ్యాస్‌ ట్రబుల్‌, అజీర్తి, కడుపు నొప్పి, మోషన్స్‌ సర్వసాధారణ సమస్యలు. ఏదైనా ఆహారం ఎక్కువ తిన్నా, తాగినా, మన శరీరానికి పడని వస్తువు తిన్నా వీటిలో ఏదో ఒక్క సమస్య వెంటనే మొదలైపోతుంది. కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు.. కారం.. మసాలా పదార్థాలు అధికంగా తీసుకోవడం.. అతిగా ఆందోళన, ఒత్తిడికి గురవడం కూడా కడుపులోని సమస్యలకు కారణం అవుతాయి. ఈ సమస్యలకు చిన్న చిట్కాలతో పరిష్కారం లభిస్తుంది. వీటి కోసం మనం బయటకు వెళ్లాల్సి అవసరం లేదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే పనైపోతుంది.

పడుకోవద్దు..

మీకు కడుపు ఇబ్బందిగా ఉన్నప్పుడు.. పడుకోకూడదు. మనం పడుకున్నప్పుడు… గ్యాస్ పైకి కదిలే అవకాశం ఉంటుంది. దీని వల్ల గుండె వద్ద మంట వస్తుంది. కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంతసేపు పడుకోకపోవడమే మంచిది. పడుకోవాలనిపిస్తే.. మెడ, ఛాతీ బాగాన్ని దిండులతో ఆసరాగా పెట్టి రెస్ట్‌ తీసుకోండి.

అల్లం..

అల్లం కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలను పరిష్కరించడానికి.. సమర్థవంతంగా పనిచేస్తుంది. అల్లంలో జింజెరోల్స్, షోగోల్స్ అనే రసాయనాలు ఉంటాయి, ఇవి కడుపులో జరిగే సంకోచాలను వేగవంతం చేస్తాయి. తద్వారా అజీర్ణం అవ్వని ఆహారం త్వరగా బయటకు వెళ్తుంది. అల్లంలోని రసాయనాలు వికారం, వాంతులు,విరేచనాలను తగ్గిస్తాయి. కడుపు నొప్పి ఉన్నవారు తమ ఆహారంలో అల్లం జోడించడం లేదా టీగా తాగితే మంచిది.

పుదీనా..

పుదీనాలోని మెంథాల్ వాంతులు, విరేచనాలను నివారిస్తుంది. పుదీనా తీసుకుంటే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ కడుపు ఇబ్బందిగా ఉంటే.. పుదీనా టీ తాగితే రిలీఫ్‌గా ఉంటుంది.

నిమ్మరసంతో..

నీటిలో ఒక చిటికెడు బేకింగ్‌ సోడా, నిమ్మరసం వేసి తాగితే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమం కార్బోనిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలోని ఎసిడిటీ, ఇతర పోషకాలు ఆల్కహాల్‌ను జీర్ణం చేయడంలో సహాయపడతాయి.

అంజీర్‌..

అంజీర్‌లో మలబద్ధకాన్ని తగ్గించడానికి మరియు ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహించడానికి కాన్సిటిపేషన్‌ మందులా పనిచేసే పదార్థాలు ఉంటాయి. అజీర్ణాన్ని తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు కూడా అంజీర్‌లో ఉంటాయి. కడుపు నొప్పితో బాధపడే వారు రోజుకు ఒక అంజీర్ తింటే.. మంచిది.

కొబ్బరి నీళ్లు..

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు కండరాళ్ల నొప్పులు, తిమ్మిరిని తగ్గిస్తాయి. ప్రతి 4-6 గంటలకు 2 గ్లాసుల కొబ్బరి నీళ్లను నెమ్మదిగా నెమ్మదిగా తాగడం వల్ల కడుపు నొప్పి లక్షణాలు తగ్గుతాయి.

అరటిపండు..

అరటిపండులో విటమిన్ బి6, పొటాషియం, ఫోలేట్ ఉంటాయి. ఈ పోషకాలు తిమ్మిరి, నొప్పులు, కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండ్లు తింటే విరేచనాలు తగ్గుతాయి.

తులసి..

ఐదారు తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నమిలి అప్పుడు వ‌చ్చే ర‌సాన్ని మింగాలి. ఆ ర‌సం కడుపులో ఏర్పడే ఇబ్బందులను, అజీర్ణాన్ని, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది. తులసి ఆకుల్లో యాంటీ అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి గ్యాస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లను తగ్గిస్తాయి.

తమలపాకులతో త్వరగా..

ఆహారం ఎక్కువగా తిన‌డం వ‌ల్ల వ‌చ్చిన అజీర్ణ స‌మ‌స్య అయితే కొన్ని తమలపాకులను నమలాలి. ఇవి జీర్ణప్రక్రియను వేగవంతం చేసే ఎంజైమ్‌లను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీని వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్యలు తలెత్తవు.

నీళ్లు సరిపడా తాగండి..

ఆహారం సరిగా అరగడానికి, దానిలోని పోషకాలు సమర్థవంతంగా గ్రహించడానికి శరీరానికి సరిపడా నీరు అవసరం. మనం నీరు తక్కువగా తాగితే జీవక్రియ కష్టమవుతుంది. ఈ విధంగా ఉంటే కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. జీర్ణ సమస్యలు ఉన్నవారు నీరు ఇంకా ఎక్కువగా తాగాలి.

వేడి నీళ్లతో స్నానం చేయండి..

వేడి నీళ్లతో స్నానం చేస్తే.. ఒత్తిడితో ఉన్న కండరాలను రిలాక్స్‌ చేస్తాయి. అజీర్తి సమస్య ఉన్నప్పుడు వేడి నీటితో స్నానం చేస్త కడుపులో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. హీట్‌ ప్యాడ్‌ను కడుపుపై 20 నిమిషాలు లేదా అది చల్లబడే వరకు ఉంచితే కడుపు నొప్పి తగ్గుతుంది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *